ఎమ్మెల్సీ ఎన్నికలు కాదు కానీ ఉత్తరాంధ్రా టీడీపీలో చిచ్చు రేగింది. సీనియర్ నేత ఈర్లె శ్రీరామ్మూర్తి ఆగ్రహించి రెబెల్ గా నామినేషన్ దాఖలు చేశారు. ఆయన పోటీ చేయడమే కాదు గెలుస్తాను అని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఆయన ప్రతీ రోజూ మీడియా ముందుకు వస్తున్నారు. తనకు టికెట్ రాకుండా అన్యాయం చేశారని తెలుగుదేశం పార్టీ నాయకులను విమర్శిస్తున్నారు.
ఆయన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిని లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు విమర్శలు చేస్తున్నారు. తనకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వకుండా ఆయనే చేశారు అని నిందిస్తున్నారు. తాను విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అనుచరుడిని అని చెప్పి అయ్యన్నపాత్రుడు టికెట్ రాకుండా చేశారు అని ఆయన అంటున్నారు.
చంద్రబాబు కూడా టికెట్ ఇస్తానని చెప్పి ఇవ్వలేదని ఫైర్ అవుతున్నారు. ఇక్కడ పాయింట్ చూస్తే ఈర్లె శ్రీరామమూర్తికి టికెట్ నిరాకరించడానికి కారణం ఆయన సమర్ధుడు కాడనో ఓడిపోతాడనో కాదట. గంటా అనుచరుడు అన్న పాయింట్ మీదనే తనకు టికెట్ ఇవ్వకుండా చేశారు అని వాపోతున్నారు. అంటే గంటా పక్కన తిరిగితే టికెట్ ఇవ్వరా అన్నదే ఈర్లె శ్రీరామమూర్తి వాదనగా ఉంది.
గంటా విషయాన్ని తీసుకుంటే ఆయన తెలుగుదేశం పార్టీఎలోనే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. పార్టీలో చురుకైన పాత్ర పోషిస్తాను అని ప్రకటించారు. ఆయన పట్ల అధినాయకత్వం వైఖరి సానుకూలంగా ఉంది. గ్యాప్స్ ఏవీ అటూ ఇటూ లేవు అని అంతా అనుకుంటున్నారు.
ఇపుడు టీడీపీ రెబెల్ ఎమ్మెల్సీ చేస్తున్న ఆరోపణలు చూస్తూంటే గంటా తో టీడీపీకి గ్యాప్ అలాగే కంటిన్యూ అవుతోందా అన్న డౌట్లు వచ్చేస్తున్నాయి. అంగబలం అర్ధబలం నిండుగా ఉన్న గంటాకు అనుచరుడిగా ఈర్లె శ్రీరామమూర్తి ఉంటే ఆయనకు టికెట్ నిరాకరించడం అంటే ఆలోచించాల్సిందే అంటున్నారు.
అయ్యన్నకు గంటాకు పడదు అన్న ప్రచారం ఉండడం వేరు. కానీ అధినాయకత్వానికి గంటా మనిషి అంటే ఎందుకు టికెట్ ఇవ్వలేదు అన్నదే బిగ్ క్వశ్చన్. ఈర్లె అంటున్న దాని మీదనే చూస్తే అయ్యన్నతో పాటు హై కమాండ్ వైఖరి మీద కూడా ఆలోచించాలనే అంటున్నారు.