తొలిసారిగా ఓ వెబ్ సిరీస్ చేసారు బాబాయ్ విక్టరీ వెంకటేష్..అబ్బాయి రానా. అంతకు ముందే సమంత కూడా చేసారు. ఇప్పుడు నాగ్ చైతన్య కూడా చేస్తున్నారు. నేషనల్ వైడ్ వెబ్ సిరీస్ లో చేయడం అంటే ఓ మల్టీ స్టారర్ పాన్ ఇండియా సినిమా చేసినట్లే అనుకోవాలి.
అలా వుంటుంది క్రేజ్ మరి. పైగా మన దగ్గర తెలుగు వెబ్ సీరిస్ లు, వెబ్ సినిమాలు అంటే ముందుగా రెమ్యూనిరేషన్లు లెక్క వేసుకుని మిగిలినవే ఖర్చు చేస్తారు. కానీ నేషనల్ లెవెల్ వెబ్ సిరీస్ లు అలా కాదు. ఓ భారీ సినిమాకు ఎలా ఖర్చు చేస్తారో అలా చేస్తారు. అందుకే మన సినిమా జనాలు నేషనల్ లెవెల్ వెబ్ సీరిస్ ల్లో నటించడానికి వెనుకాడనక్కరలేదు.
వెంకీ..రానా కలిసి తొలిసారి చేసిన వెబ్ సిరీస్..రానా నాయుడు. ఇందులో రానా నాయుడుగా రానా, అంతని తండ్రి నాగా నాయుడుగా వెంకటేష్ చేసారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ వెబ్ సిరీస్ కు వెంకటేష్ కు పది కోట్లకు పైగానే రెమ్యూనిరేషన్ వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే రానాకు ఎనిమిది కోట్ల వరకు రెమ్యూనిరేషన్ ఇచ్చారని తెలుస్తోంది. కేవలం తెలుగు సినిమాలు అయితే ఇంత రేంజ్ రెమ్యూనిరేషన్ రాదు.
వెంకటేష్ సీక్వెల్ అయిన ఎఫ్ 3 ని పక్కన పెడితే అయిదారు కోట్ల రేంజ్ లోనే రెమ్యూనిరేషన్ అందుకున్నారు. రానా కూడా అయిదు కోట్ల లోపే తీసుకున్నారు. ఈ వెబ్ సిరీస్ తో ఇద్దరూ దాదాపు డబుల్ రెమ్యూనిరేషన్లు అందుకున్నట్లే.