నాగచైతన్య-చందు మొండేటి కలిసి సినిమా చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలైంది. ఈరోజు ఈ సినిమా నుంచి ఓ వీడియో రిలీజ్ చేశారు. హీరోయిన్ ఎవరనేది చెప్పడం కోసం ఆ వీడియో వదిలారు.
నిజానికి ఆ వీడియోలో హీరోయిన్ ఎవరనేది చెప్పలేదు. చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఈ సినిమాలో హీరోయిన్ గా సాయిపల్లవిని తీసుకుంటున్నారనే విషయం ఇప్పటికే బయటకొచ్చింది. తాజాగా విడుదల చేసిన వీడియోలో కూడా చేతులు, హెయిర్ స్టయిల్ చూస్తే ఆమెనే అనే విషయం ఇట్టే అర్థమైపోతోంది.
అయితే ఈ అంశం ప్రేక్షకుల్ని ఎక్సయిట్ చేయలేదు. మరీ ముఖ్యంగా అక్కినేని ఫ్యాన్స్ కు ఇది పెద్ద కిక్ ఇవ్వలేదు. ఎందుకంటే, ఇంతకుముందే చైతూ-సాయిపల్లవి కలిసి సినిమా చేశారు కాబట్టి. వాళ్ల దృష్టి మొత్తం ఈ సినిమాకు మ్యూజిక్ డైరక్టర్ ఎవరనేదే?
ఈ మూవీకి అనిరుధ్ ను సంగీత దర్శకుడిగా తీసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. ఆ మేటర్ పై క్లారిటీ ఇవ్వమని కోరుతున్నారు చై అభిమానులు. అనిరుధ్ ను వెంటనే లాక్ చేయాలని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు.
సినిమాను తన సంగీతంతో నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్తున్నాడు అనిరుధ్. జైలర్ సినిమాను బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లేకుండా చూసి యావరేజ్ అవుతుందని భావించానని, బీజీఎం తర్వాత సినిమా బ్లాక్ బస్టర్ అయిందని స్వయంగా రజనీకాంత్ లాంటి వ్యక్తి మెచ్చుకున్నాడంటే, అనిరుధ్ స్థాయిని అర్థం చేసుకోవచ్చు.
సో.. అలాంటి సంగీత దర్శకుడ్ని పెట్టుకుంటే, చైతూ కొత్త ప్రాజెక్టుకు మంచి హైప్ వస్తుంది. అందుకే సాయిపల్లవి పేరు ఎనౌన్స్ మెంట్ కంటే ముందు, అనిరుధ్ పేరును ఎనౌన్స్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు ఫ్యాన్స్.