ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు రాజకీయం ఇక ఆపేయాల్సిందేనా. ఆయన సన్యాసం తీసుకుని క్రిష్ణా రామా అనుకోవాల్సిందేనా. చంద్రబాబు ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన అరెస్ట్ అక్రమం అంటోంది టీడీపీ, బాబు అభిమానులైన వారు అదే మాట అంటున్నారు.
అయితే చట్టప్రకారమే బాబు అరెస్ట్ అయి రిమాండ్ మీద ఉన్నారని మంత్రి గుడివాడ అమరానాధ్ అన్నారు. ఇది అందరూ తెలుసుకోవాలని అన్నారు. చంద్రబాబు అవినీతి కేసులో జైలుకు వెళ్తే టీడీపీ నేతలు యాగీ చేస్తున్నారని, అలా పార్టీని మొత్తం అవినీతిపూరితం చేశారని గుడివాడ సెటైర్లు వేశారు.
బాబు అవినీతి చేశారని జనాలు నమ్మారు కాబటే ఏపీలో ఎక్కడా స్పందన లేదని అన్నారు. బాబు అరెస్ట్ మీద అమెరికాలోనో మరో దేశంలోనో ధర్నాలు అంటూ హడావుడి చేస్తే వేసే శిక్ష ఆగిపోతుందా తగ్గిపోతుందా అని గుడివాడ ప్రశ్నిస్తున్నారు.
చంద్రబాబు చేసిన అనేక తప్పులలో ఇది ఒకటి. ఇంకా చాలా లిస్ట్ ఉంది. ఆయన తప్పులు చేస్తే చట్టం అందరికీ సమానం అని నిరూపించిందని అన్నారు. చంద్రబాబు ఈ టైం లో రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టి రిటైర్ అయిపోవడం బెటర్ అని గుడివాడ సలహా ఇచ్చారు.
చంద్రబాబు ఇన్నాళ్ళూ ఏపీకి ఎంతో చేశాను అని గొప్పలు చెప్పుకున్నారు కానీ ఇపుడు అవినీతి బయటపడేసరికి జనాలకు అన్నీ తెలిసిపోయాయని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కాదు మరో పది పార్టీలు వచ్చినా కూడా గెలిచేది వైసీపీ మాత్రమే అన్నారు. జగన్ 2024లో మళ్లీ సీఎం కావడం తధ్యమని గుడివాడ జోస్యం చెప్పేశారు.