ప్రేమమ్ సినిమా రీమేక్ టైమ్ లో చైతన్య సరసన సాయి పల్లవిని తీసుకోవడానికి ఆలోచనలు జరిగాయి. కానీ టోటల్ గా డామినేషన్ అయిపోతుందేమో అన్న పాయింట్ లు డిస్కషన్ కు వచ్చాయి. కట్ చేస్తే, ఆ తరువాత సాయి పల్లవి ఫుల్ పాపులర్ అయింది తెలుగులో. లవ్ స్టోరీ సినిమాతో చైతూ-సాయిపల్లవి హిట్ పెయిర్ అయింది. ఆ తరువాత మళ్లీ ఇన్నాళ్లకు ఆ పెయిర్ మరోసారి తెరమీదకు వస్తోంది.
చందు మొండేటి-బన్నీవాస్ కలిసి నిర్మిస్తున్న సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవిని తీసుకున్నారు. ఈ మేరకు వదలిన వదిలిన విడియోలో ఆమెను డైరెక్ట్ గా చూపించకపోయినా, జస్ట్ చేతులు మాత్రం చూపించారు. అయితే విశ్వసనీయ వర్గాలు మాత్రం ఆ సమావేశానికి సాయి పల్లవి హాజరయిందని తెలిపాయి. ఈ సినిమాకు సంగీతం సమకూర్చుకూర్చేందుకు ఎఆర్ రెహమాన్..అనిరుధ్ ల పేర్లు పరిశీలిస్తున్నారని బోగట్టా.
గత కొంతకాలంగా గీతా సంస్థ సరైన హిట్ కోసం చూస్తోంది. ఇలాంటి టైమ్ లో చందు మొండేటికి పది కోట్ల భారీ రెమ్యూనిరేషన్ ఇచ్చి ఈ సినిమా చేస్తోంది. ఇండియా-పాకిస్ధాన్-సముద్రం మీద జరిగే కథ ఇది అని తెలుస్తోంది.
ఇండియన్ మత్స్యకారుడు పాకిస్థాన్ జలాల్లోకి పొరపాటున వెళ్లి అక్కడ ఖైదు కావడం, అతగాడి ప్రేమ కథ ఇవన్నీ ఈ సినిమాలో వుంటాయని రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య వచ్చిన సీతారామం సినిమా లో కూడా ఇలాంటి పాయింట్ ఒకటి వున్న సంగతి తెలిసిందే.