చంద్రబాబు అరెస్ట్ వెనుక మోడీ..కేసీఆర్

బాబు అరెస్ట్ వెనుక మోడీ, కేసీఆర్ ఇద్దరూ వున్నారని ఫుల్ క్లారిటీ ఇచ్చారు కాంగ్రెస్ నాయకుడు మధు యాష్కీ. ఎన్ డి ఎ టైమ్ నుంచి చంద్రబాబు మీద మోడీకి దుష్మనీ వుందని, కేసీఆర్…

బాబు అరెస్ట్ వెనుక మోడీ, కేసీఆర్ ఇద్దరూ వున్నారని ఫుల్ క్లారిటీ ఇచ్చారు కాంగ్రెస్ నాయకుడు మధు యాష్కీ. ఎన్ డి ఎ టైమ్ నుంచి చంద్రబాబు మీద మోడీకి దుష్మనీ వుందని, కేసీఆర్ కు జగన్ గెలుపు కావాలని, గతంలో అలా గెలవడం కోసం వందల కోట్లు ఖర్చుచేసారని అందుకే ఇప్పుడు అరెస్ట్ వెనుక కూడా వారిద్దరు వున్నారని మధు యాష్కీ తీర్మానించారు. ఈ మేరకు ఓ ఓపెన్ స్టేట్ మెంట్ ఇచ్చారు.

కేసీఆర్,మోడీ పాత్ర కచ్చితంగా చంద్రబాబు అరెస్ట్ వెనుక వుందని మధు యాష్కీ స్పష్టంగా అన్నారు. ఆయన అరెస్ట్ వెనుక వీర పాత్ర కచ్చితంగా వుందన్నారు. ఎవరు నేరం చేసినా చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలన్నది కాంగ్రెస్ పాలసీ అని వివరించారు. చంద్రబాబుకు బెయిల్ కూడా రాకుండా అడ్డుకుంటున్నారు అంటేనే దీని వెనుక మోడీ, కేసీఆర్ హస్తం వుందని అర్థం అవుతోందని అన్నారు.

నిజంగా మోడీ వున్నారో లేదో తరువాత సంగతి, కానీ కాంగ్రెస్ తరపున ఇలాంటి స్టేట్ మెంట్ రావడం అంటే వేరుగా వుంటుంది వ్యవహారం. ఇప్పటికే భాజపా కిషన్ రెడ్డి, బండి సంజయ్, పురంధీశ్వరి లాంటి వారు చంద్రబాబు అరెస్ట్ ను ఖండించారు. ఇప్పుడు కాంగ్రెస్ ఇలా అంటోంది కనుక, వీరు మళ్లీ మరోసారి అరెస్ట్ ను ఖండిస్తారో, లేదా మధు యాష్కీ స్టేట్ మెంట్ ను ఖండిస్తారో, లేక మౌనంగా వుంటారో చూడాలి మరి.

కానీ అనవసరంగా మోడీని దీంట్లోకి లాగడం ద్వారా కాంగ్రెస్ పార్టీ చంద్రబాబుకు మేలు చేయకపోగా, మరింత కీడు చేస్తుందన్నది మాత్రం లాజికల్ పాయింట్.