ప్రభాస్ సినిమాల్లో ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్న సినిమా ప్రాజెక్ట్ కె. ఎందుకంటే దర్శకుడు నాగ్ అశ్విన్ మీద నమ్మకం. 2050 కాలంలో ప్రపంచం ఎలా వుండబోతుందో చూపించబోతున్నారంటూ వినిపిస్తున్న వార్తలు. అయితే ఈ సినిమా విడుదల ఎప్పుడు అన్నది క్లారిటీ లేదు.
ఈ సినిమా కన్నా ముందుగా ఆదిపురుష్, సలార్ ఒక భాగం లేదా రెండు భాగాలు విడుదల కావాల్సి వుంది. ఈ సమ్మర్ నుంచి వచ్చే సమ్మర్ లోగా మూడు, నాలుగు సినిమాలు విడుదల అవుతాయా? పైగా పాన్ ఇండియా భారీ సినిమాలు కదా..కాస్త గ్యాప్ బాగా వుండాలి కదా అన్న అనుమానాలు వుండనే వున్నాయి.
ఈ సినిమా మార్కెటింగ్ కొంత వరకు ఇప్పటికే సైలంట్ గా పూర్తి చేసారు. బయటకు ఆ విషయాలు రానివ్వడం లేదు. అది వేరే సంగతి. కానీ త్వరలో విడుదల తేదీ మీద, రెండు భాగాలుగా వస్తుందా? ఒక భాగమా? లేక ఫ్రాంచైజీ నా అన్న క్లారిటీ వస్తాయని తెలుస్తోంది.
ఈ మేరకు ఓ అప్ డేట్ ఇవ్వాలని నిర్మాతలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెలలో కానీ వచ్చే నెలలో కానీ వీలయినంత ముందుగా విడుదల తేదీని ప్రకటించాలని నిర్మాత అశ్వనీదత్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ అప్ డేట్ వస్తే మొత్తం ప్రభాస్ సినిమాల రిలీజ్ లైనప్ అంతా బయటకు వచ్చినట్లు అవుతుంది.