ప్రాజెక్ట్ కె అప్ డేట్ వస్తుందా?

ప్రభాస్ సినిమాల్లో ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్న సినిమా ప్రాజెక్ట్ కె. ఎందుకంటే దర్శకుడు నాగ్ అశ్విన్ మీద నమ్మకం. 2050 కాలంలో ప్రపంచం ఎలా వుండబోతుందో చూపించబోతున్నారంటూ వినిపిస్తున్న వార్తలు. అయితే ఈ…

ప్రభాస్ సినిమాల్లో ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్న సినిమా ప్రాజెక్ట్ కె. ఎందుకంటే దర్శకుడు నాగ్ అశ్విన్ మీద నమ్మకం. 2050 కాలంలో ప్రపంచం ఎలా వుండబోతుందో చూపించబోతున్నారంటూ వినిపిస్తున్న వార్తలు. అయితే ఈ సినిమా విడుదల ఎప్పుడు అన్నది క్లారిటీ లేదు. 

ఈ సినిమా కన్నా ముందుగా ఆదిపురుష్, సలార్ ఒక భాగం లేదా రెండు భాగాలు విడుదల కావాల్సి వుంది. ఈ సమ్మర్ నుంచి వచ్చే సమ్మర్ లోగా మూడు, నాలుగు సినిమాలు విడుదల అవుతాయా? పైగా పాన్ ఇండియా భారీ సినిమాలు కదా..కాస్త గ్యాప్ బాగా వుండాలి కదా అన్న అనుమానాలు వుండనే వున్నాయి.

ఈ సినిమా మార్కెటింగ్ కొంత వరకు ఇప్పటికే సైలంట్ గా పూర్తి చేసారు. బయటకు ఆ విషయాలు రానివ్వడం లేదు. అది వేరే సంగతి. కానీ త్వరలో విడుదల తేదీ మీద, రెండు భాగాలుగా వస్తుందా? ఒక భాగమా? లేక ఫ్రాంచైజీ నా అన్న క్లారిటీ వస్తాయని తెలుస్తోంది. 

ఈ మేరకు ఓ అప్ డేట్ ఇవ్వాలని నిర్మాతలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెలలో కానీ వచ్చే నెలలో కానీ వీలయినంత ముందుగా విడుదల తేదీని ప్రకటించాలని నిర్మాత అశ్వనీదత్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ అప్ డేట్ వస్తే మొత్తం ప్రభాస్ సినిమాల రిలీజ్ లైనప్ అంతా బయటకు వచ్చినట్లు అవుతుంది.