కేంద్రం పెద్దలు బాగా నచ్చారు… కానీ సోము వీర్రాజు తీరు నచ్చకే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన బీజేపీ రాష్ట్ర పార్టీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పనిలో పనిగా రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహ రావుపై విరుచుపడ్డారు. ఓవర్ నైట్ లోనే నేతలు కావాలని కొందరు ప్రయత్నిస్తున్నారని జీవీఎల్ ను ఉద్దేశిస్తూ మండిపడ్డారు.
కృష్ణా జిల్లాకు రంగా పేరు పెట్టాలని అప్పట్లో డిమాండ్ చేశామని, దాని కోసం ఉద్యమం కూడా చేశామని.. జీవీఎల్ ఆ ఉద్యమంలో పాల్లొని ఉంటే బాగుండేదని హితవు పలికారు. అలాగే రంగాపై పార్టీలో చర్చించి స్టాండ్ ఏంటో చెప్పి ఉంటే బాగుండేదని.. పార్టీతో చర్చించుకోకుండా వ్యక్తిగత ప్రయోజనల కోసం పాకులాడుతున్నారంటూ మండిపడ్డారు.
గతం కొంత కాలంగా జీవీఎల్, సోము వీర్రాజు లపై కన్నా విమర్శలు చేస్తునే ఉన్నారు. కాపులకు ఏం చేశారని జీవీఎల్ సన్మానాలు చేయించుకుంటున్నారంటూ అప్పట్లో ప్రశ్నించారు. జీవీఎల్ ఇటీవల కాలంలో కాపు అజెండా ఎత్తుకోని ఆవకాశం దొరికినప్పుడల్లా కాపుల కోసం రాజ్యసభలోను, మీడియాతోను మాట్లాడుతూ జగన్ సర్కార్ పై విమర్శలు చేస్తున్నారు.
దాదాపు కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరబోతున్నారంటూ వార్తలు వాస్తున్నాయి. టీడీపీలో కన్నా చేరితే ఎప్పటి నుండో టీడీపీ శత్రువుగా భావిస్తున్న జీవీఎల్ కు సరైన కౌంటర్ గా కన్నాను భావిస్తోంది టీడీపీ అధిష్టానం. ఇకపై జీవీఎల్, కన్నాల మధ్య విమర్శకు ప్రతి విమర్శలు కొదవ ఉండకపోవచ్చు.