మీడియా కేవలం మీడియా వ్యాపారం కాకుండా సవాలక్ష వ్యాపారాలు చేసుకోవచ్చు. అందులో మంచి చెడ్డా రెండూ వుండొచ్చు. కానీ పొరపాటున ఆ వ్యాపారాల్లో ఏదైనా తప్పు చేసి, ప్రభుత్వం, అధికార వర్గాల నుంచి ఈ తప్పులు బయటకు లాగాలని చూస్తే, మీడియా మీద దాడి అంటూ హడావుడి చేసుకోవచ్చు.
తాము చేసే సవాలక్ష వ్యాపారాలన్నింటినీ మీడియా లెక్కల్లోకి తోసేయవచ్చు. కానీ ఇది కేవలం ఆంధ్ర వరకే. ఎందుకంటే అక్కడ జగన్ అమ్మకు చిక్కిన మేక కదా..అందరికీ చులకనే.
ఇదే మోడీ చేస్తే వున్నవి అన్నీ మూసుకుని కూర్చోవాల్సిందే. మహా అయితే ఓ సింగిల్ కాలమ్ వార్త వేసి సర్దు కోవాల్సిందే. ఎందకుంటే అది జరిగింది మోడీ పాలనలో కదా..ఇక వార్తల్లేవ్..వండడం అసలే లేదు. బిబిసి అనేది అంతర్జాతీయ మీడియా సంస్థ. దానికి భారత్ లో కూడా శాఖలు వున్నాయి. కార్యాలయాలు వున్నాయి. ఇప్పుడు దాని మీద ఆదాయపన్ను శాఖ దాడులు జరిగాయి.
ఇలా జరగడానికి నేపథ్యమూ వుంది. మోడీ – గుజరాత్ అల్లర్లు ఇలాంటి జరిగిపోయిన వ్యవహారాలు ఏవో బిబిసి తవ్వితీసే పని మొదలుపెట్టింది. ఆ నేపథ్యంలోనే ఈ దాడులు జరిగాయన్నది ఇప్పుడు వినవస్తున్న వార్తల సారాశం. కానీ ఏం లాభం..ఏదో న్యూస్ ఇచ్చామంటే ఇచ్చామనే తప్ప, మీడియా మీద దాడి, పత్రికా స్వేచ్ఛ మీద దాడి అంటూ కనిపించిన ప్రతి రాజకీయ నాయకుడి చేత స్టేట్ మెంట్ లు తీసుకుని, పత్రికను నింపేసే పని అయితే వుండదు.
ఆఖరికి బిబిసితో వార్తా వ్యాపార సంబంధాలు వున్న వారికి కూడా. ఎందుకంటే అక్కడ వున్నది వైఎస్సార్ నో, జగన్ నో కాదు కదా..మోడీ..నా..మజాకానా?