కేసిఆర్ సారంటే ఆ మాత్రం భయం వుండాల!

ఒక రాష్ట్రంలో, ఒక ఎడిషన్ లో పతాక శీర్షిక కాగలిగిన వార్త మరో రాష్ట్రంలో మరో ఎడిషన్ లో ఎందుకు కాకుండా పోతుంది. ఆంధ్ర సిఎమ్ జగన్ అప్పులు చేస్తే తప్పు, తెలంగాణ సిఎమ్…

ఒక రాష్ట్రంలో, ఒక ఎడిషన్ లో పతాక శీర్షిక కాగలిగిన వార్త మరో రాష్ట్రంలో మరో ఎడిషన్ లో ఎందుకు కాకుండా పోతుంది. ఆంధ్ర సిఎమ్ జగన్ అప్పులు చేస్తే తప్పు, తెలంగాణ సిఎమ్ కేసిఆర్ చేస్తే ఒప్పు ఎందుకు అవుతుంది? అవుతుంది..ఎందుకంటే జగన్ అంటే కక్ష..కేసిఆర్ అంటే భయం కాబట్టి. ఆ మాత్రం భయం లేకపోతే హైదరాబాద్ లో వ్యాపారాలు సాగించుకోలేరు కాబట్టి.

కేంద్రం వివిధ రాష్ట్రాల అప్పులు, వైనాలు, వాటి ముందు వెనుకలు వివరంగా ప్రకటించింది. అంతే జగన్ మీద కక్ష పెంచుకుని, తెలుగుదేశాన్ని బుర్రన ఎత్తుకుని మోస్తున్న మీడియా ఆంధ్ర ఎడిషన్ లో పతాక శీర్షికలో ఆ వార్త ప్రచురించింది. కేంద్రం చెప్పిన అంకెలు నచ్చక, అసలు అంకెలు వేరే, అంటూ తమ స్వంత కవిత్వం వండి వార్చింది.

కానీ అదే సమయంలో కేసిఆర్ ప్రభుత్వ అప్పుల వైనాలు కూడా లోపల పేజీలో సింగిల్ కాలమ్ కు మాత్రమే పరిమితం అయ్యాయి. ఇలాంటి మీడియా సంస్థ ను నిబద్దత, నిజాయతీ అని ఎలా డప్పు కొట్టుకొగలరు? కానీ ఇలాంటి మీడియాల టక్కు టమార విద్యలు ఒకప్పుడు చెల్లిపోయాయి. 

ఎందుకంటే అప్పుడు ఈ పేపర్లు లేవు. ఈ జిల్లా కేంద్రంలో పెట్టిన వార్తలు పక్క జిల్లా కేంద్రానికి పెట్టిన వార్తలు వేరు. ఇలా అక్కడ బాలేదని ఇక్కడ..ఇక్కడ బాలేదని అక్కడ రాసి చలామణీ చేసేసి గట్టెక్కేవారు.

కానీ ఇప్పుడు ఈ పేపర్లు వచ్చేసాయి. ఎక్కడ ఏం రాస్తున్నారు..ఏం దాస్తున్నారు. ఇలాంటివి అన్నీ తెలిసిపోతున్నాయి. చిట్కాలు చెల్లడం లేదు. అదే ఫ్రస్టేషన్ తో వచ్చిన విద్యనే మరింతగా ప్రయోగించే ప్రయత్నం చేస్తున్నారేమో? పాపం.