ఆంధ్ర సిఎమ్ వైఎస్ జగన్ కొందరికి కొరకరాని కుట్రగా తయారయ్యారు. గతంలో ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్ ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన మృతిపై ఎన్నో అనుమానాలు వున్నాయి. నిజానికి అలా చనిపోకుండా వుండి వుంటే కచ్చితంగా మూడొసారి ముఖ్యమంత్రి అయి వుండేవారు.
ఎందుకంటే రెండో సారి పోటా పోటీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తరువాత వైఎస్ తన పంథామొత్తం మార్చేసారు. సంక్షేమానికి మరింత పెద్ద పీట వేసారు. తెలుగుదేశం పార్టీ నుంచి భయంకరంగా వలసలు జరిగాయి. ఆల్ మోస్ట్ పార్టీ నిర్వీర్యం అయిపోయింది. ఇలాంటి టైమ్ లో సడెన్ గా మరణించారు.
ఇప్పుడు ఆంధ్రలో సిఎమ్ గా జగన్ వున్నారు. ఆయన ప్రతిపక్షాలకు కొరకరాని కొయ్యగా తయారయ్యారు. రెండున్నరేళ్ల తరువాత ఆయనే మళ్లీ సిఎమ్ అయితే చాలా మందికి ఇబ్బందికరమైన వ్యవహారం. ఓ పార్టీకి, ఓ వర్గానికి అయితే చావు బతుకుల సమస్య. ఇలాంటి నేపథ్యంలో తెలుగుదేశం అనుకూల మీడియాలో భిన్నమైన కథనాలు కనిపిస్తున్నాయి.
ఒక పక్క జనంలోకి రావడానికి జగన్ భయపడుతున్నారు అన్నది ఓ పాయింట్
జగన్ కు గట్టి భద్రత కల్పిస్తుంటే జనాలు ఇబ్బంది పడుతున్నారు అన్నది మరో పాయింట్
రెండూ పాయింట్లు చూస్తుంటే భలే చిత్రంగా వుంది. ఓ పక్క జనాల్లోకి జగన్ వచ్చేయాలి. అలా చెప్పి ఆయనకు భద్రత కల్పించకూడదు అన్న యావ కనిపిస్తోంది. ఓ పక్క నిఘా వర్గాలు జగన్ భద్రత పెంచాలని హెచ్చరించాయి అని వార్తలు వచ్చాయి. అంటే జగన్ జాగ్రత్త పడాలి కదా. ఎటువంటి భద్రత లేకుండా ఎలా తిరిగేస్తారు? తన బతుకు మీద ఎంతో మంది ఆధారపడి వున్నారు. ఓ పార్టీ ఆధారపడి వుంది. అది విస్మరించకూడదు కదా.
ఈ రెండున్నరేళ్లు జగన్ చాలా జాగ్రత్తగా వుండాల్సిన అవసరం వుంది. ఏ మూల నుంచి ఏ ప్రమాదం పొంచి వుందో ఎవ్వరూ చెప్పలేరు కదా? పైగా నిఘా వర్గాలు ఊరికనే హెచ్చరించవు. ఫ్రస్టేషన్ తో దేనికైనా తెగబడేవారు ఎక్కడైనా వుంటారు. జనంలోకి రారు అని రెచ్చగొట్టేవారు వుంటారు. అలాగే భద్రత లేకుండా జనంలోకి రాలేకపోతున్నారు అని ఎద్దేవా చేసేవారు వుంటారు.
మరోపక్క చంద్రబాబు లాంటి వారు తండ్రిలాగే గాల్లో కలిసిపోతాడు అని జోస్యం చెబుతంటారు. అందువల్ల జగన్ తన ప్రాణానికి భయం వుందని గుర్తుంచుకుని జాగ్రత్త పడుతూనే వుండాలి.