దశాబ్దాల పాటు శ్రీలంక ప్రభుత్వాన్ని గడడలాడించిన లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం(ఎల్టీటీఈ)- చీఫ్ ప్రభాకర్ చనిపోయినట్లు శ్రీలంక ప్రభుత్వం ప్రకటించిన పద్నాలుగు సంవత్సరాల తర్వాత.. ప్రభాకరన్ బతికే ఉన్నరంటూ కాంగ్రెస్ మాజీ నేత, ప్రపంచ తమిళుల సమాఖ్య అధ్యక్షుడు నెడుమారన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
నెడుమారన్ తంజావూరులో మీడియాతో మాట్లాడుతూ, “ఎల్టీటీఈ చీఫ్ ప్రభాకరన్ బతికే ఉన్నరని.. తర్వలో అందరి ముందుకు వచ్చి తమిళ ఈలం కోసం ప్రణాళికలను ప్రకటిస్తారని.. శ్రీలంకలో రాజపక్సే ప్రభుత్వం పతనం కావడంతో ప్రభాకరన్ ప్రజల ముందుకు వచ్చేందుకు ఇదే సరైన సమయం అని వెల్లడించారు.
లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం(ఎల్టీటీఈ) ని స్థాపించి, శ్రీలంకలోని తమిళుల కోసం ప్రత్యేక దేశం కావాలంటూ విస్తృతమైన పోరాటం చేసిన ప్రభాకరన్ ను 2009 మే లో శ్రీలంక సైన్యం హతమార్చింది. అప్పట్లో ఆ మృతదేహానికి సంబంధించి చాలా అనుమానాలు వచ్చాయి. 1991లో శ్రీపెరంబుదూర్ లో ఆత్మాహుతి బాంబు దాడి చేసి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య చేసిన కేసులో ప్రభాకరన్ ప్రధాన నిందితుడు.