నాని..ప్రేమ పురాణ వేదాంతం

హీరో నాని లేటెస్ట్ సినిమా దసరా. ఈ సినిమా మీద చాలా అంచనాలు వున్నాయి. రా..రస్టిక్ సబ్జెక్ట్ తో, నాని పూర్తిగా వైవిధ్యమైన గెటప్ తో తయారవుతున్న సినిమా. ఈ సినిమా నుంచి రెండో…

హీరో నాని లేటెస్ట్ సినిమా దసరా. ఈ సినిమా మీద చాలా అంచనాలు వున్నాయి. రా..రస్టిక్ సబ్జెక్ట్ తో, నాని పూర్తిగా వైవిధ్యమైన గెటప్ తో తయారవుతున్న సినిమా. ఈ సినిమా నుంచి రెండో పాట విడుదలయింది. వారి..ఓరి..నీదుర పోరి అంటూ సాగే పాట ఇది. 

లవ్ ఫెయిల్యూర్ బ్యాక్ డ్రాప్ లో కుర్రాడు తనకు తానే నచ్చ చెప్పుకోవడమో, లేదా మిత్రబృదం సముదాయించడమో లాంటి నేపథ్యంలో సాగే పాటలా కనిపిస్తోంది ఇది. శ్రీమణి..ప్రేమ పురాణంలోంచి పుట్టిన వేదాంతాన్ని గీతంగా మలిచినట్లు కనిపిస్తోంది.

బాల్యమే గొప్పది..బాధ మరచిపోతది..చందమామ రాదు అనే నిజం నమ్మనంటది…అనే మంచి లైన్ వుందీ పాటలో. కోడె ఈడు సెడ్డది..నిజాన్ని కోడై కూస్తది అంటూ బాల్యానికి యవ్వనానికి వున్న తేడాని చిన్న లైన్ లో చెప్పేసారు కవి శ్రీమణి. పాట కవిత్వం సంగతి అలా వుంచితే ట్యూన్ ను వింటేజ్ టచ్ తో చేయాలని చూసారు. అందుకు తగిన ఇనుస్ట్రుమెంటేషన్ వాడారు. అంత వరకు బాగానే వుంది.

కానీ పాటకు క్యాచీ ట్యూన్ అమరిందా? అని ఆలోచిస్తే మాత్రం కాస్త అనుమానమే. వినగా వినగా పట్టడం అన్నది పక్కన పెడితే, సినిమాలో చిత్రీకరణలో జనాలకు పట్టే అవకాశం వుంటుందనుకోవాలి. పైగా తెలంగాణ మాండలీకంలోని ఎక్కువగా వినిపించని పదాలను తీసుకువచ్చి పేర్చడం వల్ల, కొంచెం టైమ్ పడుతుంది ఈ పాట జనంలోకి వెళ్లడానికి.