జీవీఎల్ స‌రికొత్త డిమాండ్!

వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఎలాగైనా ప్ర‌జా క్షేమంలోకి వెళ్లి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఉవ్విల్లూరుతున్నట్టు జీవీఎల్ న‌ర‌సింహ‌రావు ఈ మ‌ధ్య కాలంలో రాష్ట్రంలోని స‌మ‌స్య‌ల‌ను కాకుండా కాపు స‌మ‌స్య‌ల‌ను నేత్తిన ఎత్తుకున్నారు దానిలో భాగంగా…

వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఎలాగైనా ప్ర‌జా క్షేమంలోకి వెళ్లి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఉవ్విల్లూరుతున్నట్టు జీవీఎల్ న‌ర‌సింహ‌రావు ఈ మ‌ధ్య కాలంలో రాష్ట్రంలోని స‌మ‌స్య‌ల‌ను కాకుండా కాపు స‌మ‌స్య‌ల‌ను నేత్తిన ఎత్తుకున్నారు దానిలో భాగంగా ఎక్క‌డ కుల మీటింగులు పెట్టిన అక్క‌డికి వెళ్లి సన్మానాలు చేయించుకోని.. ప‌నిలో ప‌నిగా టీడీపీ- వైసీపీని విమ‌ర్శించ‌డం ప‌రిపాటిగా ఉంది.

గ‌తంలో నరసాపురం లోకసభ నియోజకవర్గం నుండి పోటి చేయ‌బోతున్న‌ట్లు లికులు ఇచ్చి త‌ర్వాత విశాఖప‌ట్నం అయితే సేఫ్ అనుకోని అక్క‌డ నుండి రాజ‌కీయం మొద‌లు పెట్టిన జీవీఎల్ .. రాజ్య‌స‌భ‌లో టైం దోరికితే చాలు విశాఖకు సంబంధించిన స‌మ‌స్య‌లు, కాపుల స‌మ‌స్య‌లపై మాట్లాడుతున్నా ఆయ‌న ఈ రోజు రాజ్య‌స‌భ‌లో కాపులు ఆరాధ్య దైవంగా బావిస్తున్నా వంగవీటి మొహన్ రంగారావు గురించి మాట్లాడారు.

ఈ రోజు రాజ్య‌స‌భ జీరో ఆవ‌ర్ లో రంగా గురించి మాట్లాడుతూ.. రంగాను కొంద‌రు ద్రోహులు హ‌త‌మార్చార‌ని. ప్రజల కోసం నీతి, నిజాయతీగా పోరాటం చేసిన వ్యక్తి రంగా అని.. అందుకే ఏపీలో ఒక జిల్లాకు రంగా పేరు పెట్టాడంతో పాటు .. విజ‌య‌వాడ ఎయిర్ పోర్ట్ కు కూడా రంగా పేరు పెట్టాల‌ని సూచించారు. విజ‌య‌వాడ లేదా కృష్ణ జిల్లాల‌కు రంగా పేరు పెట్టాల‌ని డిమాండ్ చేశారు.

గ‌తంలో కూడా కాపుల రిజర్వేషన్స్ గురించి రాజ్య‌స‌భలో జీవీఎల్ ప్ర‌స్త‌వించారు. బీజేపీకి ఎలాగు ఓటు బ్యాంక్ లేద‌ని తెలుసుకున్నా జీవీఎల్ కాపుల అజెండా ఎత్తుకున్నారు. ఈ మ‌ధ్య కాలంలోనే బీజేపీ సీనియ‌ర్ నేత కన్నా లక్ష్మీనారాయణ..  జీవీఎల్ ఏం సాధించార‌ని కాపులు స‌న్మానాలు చేస్తున్నారో అర్థం కావ‌డం లేదని ఘూటు వ్యాఖ్య‌లు కూడా చేశారు.