పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొద్దిరోజుల పాటు పూర్తిగా సాత్వికాహారంలోకి మారారు. తన హెయిర్ స్టయిల్ ను మార్చారు. ఇదంతా వినోదయ సితం రీమేక్ కోసమే. ఈ సోషియో ఫాంటసీ సినిమాలో పవన్ దేవుడి పాత్ర ను పోషిస్తున్న సంగతి తెలిసిందే. అందుకోసమే ఈ మార్పు.
గెటప్ మార్పు సంగతి సరేసరి. సాత్వికాహారం అన్నది గతంలో గోపాల గోపాల టైమ్ లో కూడా పవన్ పాటించినట్లు తెలుస్తోంది. పవిత్రమైన పాత్రలు ధరించేటపుడు ఇలా చేయడం అన్నది సీనియర్ ఎన్టీఆర్ కు కూడా అలవాటు. అలాంటి పద్దతినే పవన్ కూడా అలవర్చుకున్నట్లు కనిపిస్తోంది.
ఈ నెల రెండో వారం లో ఏదో ఒకరోజు అటు ఇటుగా వినోదయ సితం రీమేక్ మీదకు పవన్ వెళ్లబోతున్నారు. అందుకే హెయిర్ స్టయిల్ తో పాటు ఆహారపు అలవాట్లు కూడా మార్చారు. పైగా ఫిజిక్ కూడా కాస్త ఫిట్ కావడం కోసం వ్యాయామం స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది.
ఇదిలా వుంటే క్రిష్ డైరక్షన్ లోని హరిహర వీరమల్లు షూట్ పరిస్థితి అలాగే వుంది. సుజిత్ డైరక్షన్ లో ఓజి సినిమా చేయాలి. ఇవన్నీ కాకుండా ఎప్పటి నుంచో వార్తల్లో వుంటూ వస్తున్న హరీష్ శంకర్ సినిమా కూ పవన్ ప్లానింగ్ లో వుంది. ఇవన్నీ టొటల్ గా ఎప్పుడు పూర్తవుతాయనే ప్రశ్న మాత్రం అడగొద్దు. ఎందుకంటే బహుశా అది పవన్ కు కూడా సమాధానం తెలియని ప్రశ్న కావచ్చు.