కీర్తిసురేష్, అనిరుధ్ పెళ్లి చేసుకుంటున్నారా?

కీర్తిసురేష్ పెళ్లిపై పుకార్లు కొత్తేంకాదు. ఇక అనిరుధ్-ఆమె పెళ్లి చేసుకుంటున్నారనే రూమర్ కూడా కొత్తకాదు. కాకపోతే బాలీవుడ్ మీడియాలో ఇది మరోసారి వైరల్ అయింది. ఈసారి ఇటు కీర్తిసురేష్, అటు ఆమె తండ్రి సురేష్…

కీర్తిసురేష్ పెళ్లిపై పుకార్లు కొత్తేంకాదు. ఇక అనిరుధ్-ఆమె పెళ్లి చేసుకుంటున్నారనే రూమర్ కూడా కొత్తకాదు. కాకపోతే బాలీవుడ్ మీడియాలో ఇది మరోసారి వైరల్ అయింది. ఈసారి ఇటు కీర్తిసురేష్, అటు ఆమె తండ్రి సురేష్ ఒకేసారి రియాక్ట్ అయ్యారు. పెళ్లి పుకార్లను సంయుక్తంగా ఖండించారు.

కీర్తిసురేష్-అనిరుధ్ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తను సురేష్ కుమార్ ఖండించాడు. ఆ కథనాల్లో నిజం లేదని, ఎవరో పనిగట్టుకొని ఈ వార్తల్ని పుట్టిస్తున్నారని అన్నాడు. అంతేకాదు, వీళ్లిద్దరి పెళ్లిపై పుకార్లు రావడం ఇదే తొలిసారి కూడా కాదని స్పష్టం చేసిన ఆయన, కూతురు పెళ్లిపై అంతకుమించి స్పందించడానికి నిరాకరించాడు.

అటు కీర్తిసురేష్ కూడా తన పెళ్లి పుకార్లపై స్పందించింది. అనిరుధ్ ను తను పెళ్లాడబోనని, అతడు తనకు మంచి స్నేహితుడు మాత్రమేనని స్పష్టం చేసింది.

కొన్ని నెలల కిందట దుబాయ్ కు చెందిన వ్యాపారవేత్త ఫర్హాన్ తో కీర్తిసురేష్ డేటింగ్ లో ఉందంటూ వార్తలు వచ్చాయి. ఈ న్యూస్ ను కీర్తిసురేష్ ఖండించింది. ఫర్హాన్ తనకు స్నేహితుడు మాత్రమేనని క్లారిటీ ఇచ్చింది. అదే టైమ్ లో మరో ప్రకటన కూడా చేసింది. తన లైఫ్ లో ఉన్న మిస్టరీ మేన్ ను త్వరలోనే వెల్లడిస్తానని ప్రకటించింది.