సెల‌బ్రిటీల పెళ్లి ఫొటోలూ, వీడియోలు.. ధ‌ర రూ.కోట్ల‌లో!

కాదేదీ వ్యాపారానికి అన‌ర్హం.సెల‌బ్రిటీల వ్య‌వ‌హారాల‌ను గ‌మ‌నిస్తే అర్థం అయ్యే విష‌యం ఇది. సినిమా, క్రికెట్ సెల‌బ్రిటీలు త‌మ‌కు సంబంధించిన ప్ర‌తిదాన్నీ మార్కెటింగ్ అంశంగానే వ్య‌వ‌హ‌రిస్తూ ఉంటారు. ఒక‌వేళ వారికి ఆ ఉద్దేశం లేక‌పోయినా… మార్కెట్…

కాదేదీ వ్యాపారానికి అన‌ర్హం.సెల‌బ్రిటీల వ్య‌వ‌హారాల‌ను గ‌మ‌నిస్తే అర్థం అయ్యే విష‌యం ఇది. సినిమా, క్రికెట్ సెల‌బ్రిటీలు త‌మ‌కు సంబంధించిన ప్ర‌తిదాన్నీ మార్కెటింగ్ అంశంగానే వ్య‌వ‌హ‌రిస్తూ ఉంటారు. ఒక‌వేళ వారికి ఆ ఉద్దేశం లేక‌పోయినా… మార్కెట్ వ‌ర్గాలే వారిని ఈ దిశ‌గా తీసుకెళ్తాయి! ఇప్ప‌టికే వారు సోష‌ల్ మీడియాలో పెట్టే పోస్టులు కూడా పూర్తి వ్యాపారమ‌యం అని జ‌నాల‌కు బాగానే అర్థం అయ్యింది. సినిమా వాళ్లు, క్రికెట‌ర్లు ఇన్ స్టాలోనో, ట్విట‌ర్లోనో ఏదో ఒక‌టి పోస్టు చేసినా.. దాని వెనుక చాలా వ్యాపార లెక్క‌లే ఉంటాయి. సొంత ఫొటోలు పెట్టారంటే అది ఫాలోయింగ్ ను పెంచుకునేందుకు. ఇక చాలా పోస్టుల‌కు రేటు క‌డ‌తారు. బ్రాండింగ్ ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా వాటిని పోస్టు చేస్తారు.

మ‌రి సోష‌ల్ మీడియానే కాదు.. జీవితంలో అతి ముఖ్య‌మైన వివాహ ఘ‌ట్టాన్ని కూడా వారు మార్కెటింగ్ గా మార్చుకుని చాలా కాలం అవుతూ ఉంది. ఎప్పుడో ఐశ్వ‌ర్య‌రాయ్- అభిషేక్ బ‌చ్చ‌న్ ల వివాహం జ‌రిగిన‌ప్పుడు ఇలాంటి వార్త‌లు వ‌చ్చాయి. వారు త‌మ పెళ్లి టెలికాస్టింగ్ హ‌క్కుల‌ను అమ్మార‌నే వార్త‌లు అప్ప‌ట్లో గుప్పుమ‌న్నాయి. ఆ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు కానీ, దాదాపు ద‌శాబ్దంన్న‌ర కింద‌టే ఆ పెళ్లి స‌ర్వ‌త్రా ఆసక్తి రేపింది. అందుకు త‌గ్గ‌ట్టుగానే రేటు ద‌క్కి ఉండ‌వ‌చ్చు!

ఇక ఇటీవ‌లి కియ‌రా అద్వానీ- సిద్ధార్థ్ మ‌ల్హోత్రాల పెళ్లి ప్ర‌సార హ‌క్కులు కూడా భారీ ధ‌ర ప‌లికిన‌ట్టుగా తెలుస్తోంది. ఒక ఓటీటీ సంస్థ వీరి పెళ్లి ప్ర‌సార హ‌క్కుల‌ను కొన్న‌ట్టుగా తెలుస్తోంది. వీరు త‌మ పెళ్ళికి ఆహ్వానించిన అతిథుల‌కు ఒకే కండీష‌న్ పెట్టార‌ట‌. ఫొటోల‌ను తీసి సోష‌ల్ మీడియాలో పెట్ట‌వ‌ద్దంటూ స్ప‌ష్టంగా చెప్పార‌ట‌. పెళ్లికి పిలిచే అతిథుల‌కు ఎవ్వ‌రూ దాదాపు కండీష‌న్లు పెట్ట‌రు! ఎందుకంటే పెళ్లిళ్ల‌లో అతిథుల స‌త్కారం ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తారు సామాన్యులు. అయితే సెల‌బ్రిటీల ఫార్మాల్ రిలేష‌న్ షిప్ ల‌లో ఈ కండీష‌న్లు మామూలేనేమో! కియ‌రా, సిద్ధార్థ్ పెళ్లికి హాజ‌రైన వారు అక్క‌డ త‌మ సెల్ ఫోన్ల‌లో ఫొటోలు తీయ‌డానికి లేదు, తీసినా వాటిని సోష‌ల్ మీడియాలో పెట్ట‌డానికి లేదు! ఇలా వాటి ప్ర‌సార హ‌క్కుల‌ను ఎవ‌రికో అమ్మేసి ఉంటారు. అది ఒక ఓటీటీ ప్లాట్ ఫామ్ అని.. తెలుస్తోంది. వీరికి ఉన్న మార్కెట్ ను బ‌ట్టి.. ఏ యాభై కోట్ల రూపాయ‌ల ధ‌ర‌కో ఈ టెలికాస్ట్ హ‌క్కులు అమ్ముడ‌యిఉండ‌టంలో ఆశ్చ‌ర్యం లేదు.

మ‌రి ఒక‌వేళ ఈ ఫొటోలు బ‌య‌ట‌కు వ‌స్తే? అప్పుడు ఈ డీల్స్ ర‌ద్దు అవుతాయి!పెళ్లికి సంబంధించి ఏదో ఒక‌టీ రెండు ఫొటోలు బ‌య‌ట‌కు వ‌స్తే ఓటీటీ సంస్థ‌లు ఓకే అంటాయి. అయితే ఎక్కువ ఫొటోలు వెలుగులోకి వ‌స్తే.. అప్పుడు అవి ఒప్పందాల‌ను ర‌ద్దు చేసుకుంటాయ‌ని తెలుస్తోంది. నయ‌న‌తార‌- విఘ్నేష్ శివ‌న్ ల పెళ్లి వీడియోల ఒప్పందం ఇలాగే ర‌ద్ద‌య్యింద‌ట‌. ఏకంగా ముప్పై కోట్ల రూపాయ‌లు ఇచ్చి ఈ పెళ్లి టెలికాస్ట్ హ‌క్కుల‌ను ఒక ఓటీటీ సంస్థ కొనుగోలు చేయ‌గా, విఘ్నేష్ శివ‌న్ ఎక్కువ ఫొటోల‌ను బ‌య‌ట‌కు వ‌ద‌ల‌డంతో.. ఆ సంస్థ ఒప్పందాన్ని ర‌ద్దు చేసుకుంద‌ని వినికిడి!

ఒక ఇలా కోట్ల రూపాయ‌ల‌ను పెట్టి ఈ పెళ్లి హ‌క్కుల‌ను కొనే  ఆ సంస్థ‌లు వాటి ద్వారా పెట్టుబ‌డిని రాబ‌డ‌తాయి. ఓటీటీల్లో ప్ర‌సారం చేయ‌డానికి వాటికి కంటెంట్ కావాలి! దాని కోసం ఎలాగైనా ఖ‌ర్చు అవుతుంది. అలాంట‌ప్పుడు ఈ సెల‌బ్రిటీల ఫెళ్లి వీడియోల‌ను పెట్ట‌వ‌చ్చు. హ‌న్సిక పెళ్లి వీడియోల‌ను ఇలానే ఒక సీరిస్ లా ప్ర‌సారం చేస్తోందొక ఓటీటీ. ఆమె ప్రేమ క‌థ అని, పెళ్లి క‌థ అని దీనికి స్క్రిప్ట్ ను జోడించి.. పెళ్లికి అటూ ఇటూ కొంత షూట్ చేసి దీన్నొక వెబ్ సీరిస్ గా మార్చారు! ఇలా సెల‌బ్రిటీల పెళ్లి హ‌క్కుల‌ను కొన్న వారు వీటితో లాభాల‌ను పొందే ప్ర‌య‌త్నం చేస్తూ ఉంటారు.

ప్రియాంక చోప్రా, నిక్ జోన‌స్ ల పెళ్లి హ‌క్కులు అప్ప‌ట్లోనే 18 కోట్ల రూపాయ‌లకు అమ్ముడ‌య్యాయ‌ట‌. ఇక విరాట్ కొహ్లీ- అనుష్క‌ల పెళ్లి ఫొటోల‌పై ఒక మ్యాగ‌జైన్ హ‌క్కుల‌ను పొంది అచ్చేసింది. ఆ మొత్తాన్ని చారిటీకి ఇచ్చింద‌ట ఆ జంట‌. ఇలా సాగుతున్నాయి ఈ వ్య‌వ‌హారాలు. మొత్తానికి సెల‌బ్రిటీ హోదా క‌లిగిన వారు పెళ్లి చేసుకున్నా.. ఇలా ప‌దుల కోట్ల రూపాయ‌లు వ‌చ్చిప‌డుతున్నాయ‌న‌మాట‌!