కర్ణాటక.. భారీ విజయం దిశగా బీజేపీ!

కర్ణాటక ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పూర్తి ఆధిపత్యాన్ని కనబరుస్తూ ఉంది. 15 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల కౌంటింగ్ ప్రస్తుతం సాగుతూ ఉంది. 10 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ…

కర్ణాటక ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పూర్తి ఆధిపత్యాన్ని కనబరుస్తూ ఉంది. 15 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల కౌంటింగ్ ప్రస్తుతం సాగుతూ ఉంది. 10 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ లీడింగ్ లో ఉండటం విశేషం. కాంగ్రెస్ పార్టీ మూడు స్థానాల్లో, జేడీఎస్ ఒక్క స్థానంలో లీడింగ్ లో ఉంది. హొస్కోటే  లో మాత్రం బీజేపీ రెబల్ ముందున్నట్టుగా ఉన్నాడు అర్లీ ట్రెండ్స్ లో.

యడ్యూరప్ప ప్రభుత్వం  మనుగడకు ఉప ఎన్నికల ఫలితాలు చాలా కీలకం. ఇలాంటి నేపథ్యంలో.. వీటిల్లో బీజేపీ దూసుకపోతూ ఉండటం విశేషం. అన్నింటికీ మించి.. ఇవన్నీ కాంగ్రెస్- జేడీఎస్ సీట్లు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొని మరీ కాంగ్రెస్ ఈ సీట్లలో నెగ్గింది. వీటిల్లో నెగ్గిన వారు భారతీయ జనతా పార్టీ వైపుకు ఫిరాయించారు. దీంతో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ప్రభుత్వం కూలిపోయింది.

ఫిరాయింపుదారులపై అనర్హత వేటు పడటంతో.. ఉప ఎన్నికలు వచ్చాయి. వీటిల్లో కనీసం ఏడు స్థానాల్లో నెగ్గడం యడ్యూరప్ప సర్కారుకు అనివార్యం అయ్యింది. అయితే అంతకు మించి నెగ్గేలా ఉన్నారు బీజేపీ వాళ్లు. కాంగ్రెస్ రెబెల్స్ కే మొత్తం టికెట్లను కేటాయించింది కమలం పార్టీ.

అయినప్పటికీ వారికి ప్రజలు సానుకూల తీర్పును ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. చూస్తుంటే.. వారు సుస్థిర ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేసినట్టుగా ఉన్నారు. కాంగ్రెస్ ను గెలిపించినా రాజకీయ రచ్చే తప్ప ఉపయోగం ఉండదు. ఎలాగైనా బీజేపీ నే ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటుంది. ఇకపై కొనుగోళ్లకు తెరదించడానికి ప్రజలే బీజేపీకి ఓటేసినట్టుగా ఉన్నారు!