యువ హీరోను ముంచిన శిల్పా చౌద‌రి

కిట్టి పార్టీల పేరుతో ప్ర‌ముఖుల‌ను టార్గెట్ చేసిన శిల్పా చౌద‌రి బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా మ‌రో సెల‌బ్రిటీ బాధితుడు త‌న‌కు న్యాయం చేయాలంటూ పోలీసుల‌ను ఆశ్ర‌యించ‌డం గ‌మ‌నార్హం. రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారంలో…

కిట్టి పార్టీల పేరుతో ప్ర‌ముఖుల‌ను టార్గెట్ చేసిన శిల్పా చౌద‌రి బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా మ‌రో సెల‌బ్రిటీ బాధితుడు త‌న‌కు న్యాయం చేయాలంటూ పోలీసుల‌ను ఆశ్ర‌యించ‌డం గ‌మ‌నార్హం. రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబ‌డి పేరుతో త‌న ద‌గ్గ‌ర రూ.3 కోట్లు తీసుకున్న శిల్పా చౌద‌రి, ఆ త‌ర్వాత అస‌లు ప‌ల‌క‌డం లేద‌ని యువ‌ హీరో హర్ష్ కనుమల్లి ల‌బోదిబోమంటున్నారు.

శిల్పా చౌద‌రి మోసానికి హ‌ర్ష్ భారీ మూల్య‌మే చెల్లించాడు. సెహ‌రి సినిమా హీరోగా హ‌ర్ష్ ప‌రిచ‌యం. రొమాంటిక్ క‌థా వ‌స్తువుతో సినిమా తెర‌కెక్కింది. ఈ సినిమాలో హ‌ర్ష్ స‌ర‌స‌న సిమ్రాన్ చౌద‌రి హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. 

శిల్పా చౌద‌రి ఇచ్చిన పార్టీల వ‌ల‌లో ఇరుక్కుని భారీ మొత్తంలో అప్పుగా ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. శిల్పా చౌద‌రి మోసాల‌పై రోజుకో క‌థ వెలుగు చూస్తోంది.

ఇప్ప‌టికే ఈమె బాధిత జాబితాలో హీరో మ‌హేశ్‌బాబు సోద‌రి, యువ హీరో సుధీర్‌బాబు భార్య ప్రియ‌ద‌ర్శిని చేరిన సంగ‌తి తెలిసిందే. ఈమె కూడా హ‌ర్ష్‌తో స‌మానంగా 2.90 ల‌క్ష‌లు శిల్పా చేతిలో పెట్టి మోస‌పోయింది. త‌మ‌కు న్యాయం చేయాల‌ని హ‌ర్ష్ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేయ‌డంతో వాస్త‌వం వెలుగు చూసింది. 

ఇదిలా ఉండ‌గా శిల్పా చౌద‌రిని పోలీసులు క‌స్ట‌డీకి తీసుకుని విచారిస్తున్నారు. ఎక్క‌డెక్క‌డ పెట్టుబ‌డులు పెట్టారో విచార‌ణ‌లో వెలుగు చూసే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. శిల్పా చేతిలో ఇరుక్కున్న సొమ్మును ఎలా రాబ‌ట్టుకోవాలో తెలియ‌క బాధితులు ల‌బోదిబోమ‌ని వాపోతున్నారు.