సిద్దార్ధ చాలా బోల్డ్ గురూ

తెలుగు హీరోలు, టాలీవుడ్ జ‌నాలు ప్రభుత్వాలతో వైరం పెట్టుకోకుండా, విమర్శించకుండా వీలయినంత స్మూత్ గా పనులు చక్క బెట్టుకోవాలని చూస్తున్నారు. ప్రభుత్వం తప్పు చేస్తే ఇది తప్పు అని చెప్పడం కూడా మానేసారు.  Advertisement…

తెలుగు హీరోలు, టాలీవుడ్ జ‌నాలు ప్రభుత్వాలతో వైరం పెట్టుకోకుండా, విమర్శించకుండా వీలయినంత స్మూత్ గా పనులు చక్క బెట్టుకోవాలని చూస్తున్నారు. ప్రభుత్వం తప్పు చేస్తే ఇది తప్పు అని చెప్పడం కూడా మానేసారు. 

ఆంధ్రలో టికెట్ రేట్లు తగ్గించేసినా, ఏదో విధంగా ప్రభుత్వాన్ని మంచి చేసుకుని, రేట్లు తెచ్చుకోవాలనే చూస్తున్నారు తప్ప, బిసి కాలం నాటి రేట్లు ఇవి అని నిలదీసే ప్రయత్నం చేయలేదు.

కానీ తమిళ హీరో సిద్దార్ద మాత్రం నికార్సగా ఆ పని చేసాడు ట్విట్టర్ లో. సేవ్ సినిమా అనే ట్యాగ్ లైన్ తో వరుస ట్వీట్ లు వేసాడు. పాతికేళ్ల క్రితం అమెరికాలో తొలిసారి సినిమా చూసినపుడు 200 రూపాయల టికెట్ అని. ఇప్పుడు మన సినిమా కూడా సాంకేతికతను అందిపుచ్చుకుని ఎదిగిందని గుర్తు చేసారు.

మనకు తిండి పెట్టే రైతన్న ను సదా ప్రశంసిస్తామని, తాము అంత గొప్ప వాళ్లం కాకపోయినా, తాము కూడా మనుషులమే, పన్ను కడుతున్నవాళ్లమే అని సిద్దార్ద గుర్తు చేసాడు. తాము తమ బతుకులు పణంగా పెట్టి, జ‌నాలకు వినోదం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నామన్నారు.

సిద్దార్ధ నేరుగా ఆంధ్ర, టికెట్ రేట్లు అనే విషయాలను ప్రస్తావించకున్నా, అన్యాపదేశంగా అందులో వున్న విషయం అదే అని అర్థం అయిపోతోంది.