పార్టీలు చూడమన్న వైసీపీ నినాదం ఫలించింది

వైసీపీ అధికారంలోకి వచ్చాక రాజకీయాలు చూడం, పార్టీలు చూడం అంటూ అర్హులైన లబ్దిదారులు అందరికీ పధకాలు అందిస్తోంది. దాని ఫలితం ఏంటో ఇపుడు అక్షరాలా తెలిసి వస్తోంది. నిన్నటికి నిన్న విజయనగరం జిల్లాలో తెలుగుదేశం…

వైసీపీ అధికారంలోకి వచ్చాక రాజకీయాలు చూడం, పార్టీలు చూడం అంటూ అర్హులైన లబ్దిదారులు అందరికీ పధకాలు అందిస్తోంది. దాని ఫలితం ఏంటో ఇపుడు అక్షరాలా తెలిసి వస్తోంది. నిన్నటికి నిన్న విజయనగరం జిల్లాలో తెలుగుదేశం మాజీ సర్పంచు ఫ్యామిలీకి జగనన్న విద్యా దీవెనను అమలు చేస్తే ఆయన వేన్నోళ్ల వైసీపీని పొగిడారు, జగన్ ది గొప్ప పాలన అన్నారు.

ఇపుడు మరో విశేషం. ఉమ్మడి విశాఖ జిల్లాలో మాడుగుల నియోజకవర్గం మాడుగుల మండలం కింతలి గ్రామానికి చెందిన ఇరవై నాలుగు టీడీపీనే అభిమానించే కుటుంబాలు వారితో పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వైసీపీకి జై కొట్టారు. వారంతా ఎప్పటి నుంచో తెలుగుదేశం అభిమానులు. జగన్ పాలనలో తమకు జరిగిన మేలు చూసి ఫ్యాన్ నీడకు చేరుకున్నారు. అలా అంతా కలసి వైసీపీలో  చేరారు.

వైసీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదర్శాలు తమను ప్రభాతం చేశాయని వారు అంటున్నారు. ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు నాయకత్వంలో గ్రామాలు నలు దిశల అభివృద్ధి చెందడం ద్వారా సంతోషకరమని తెలుగుదేశం నుంచి వైసీపీలోకి అందుకే చేరామని వెల్లడించారు.

ఇపుడు చూస్తే ఎన్నికల ఏడాదిలోకి రాష్ట్రం ప్రవేశించింది. సహజంగా అధికార పార్టీ నుంచి నాయకులు విపక్షం వైపు రావాలి. నాయకులు జంపింగ్స్ ఫక్తు రాజకీయ క్రీడ. అందులో అసలు విషయాలు అందరికీ  తెలిసినవే. గ్రామ స్థాయిలో ఉంటే ప్రజలు, క్యాడర్ ఎటు వైపు అన్నదే కొలమనంగా చూడాలి. అలా చూసుకుంటే ఇపుడు కింతలిలో కుటుంబాలు పెద్ద ఎత్తున చేరడాన్ని బట్టి చూస్తే అర్ధమవుతోంది అని వైసీపీ నేతలు అంటున్నారు.

వైసీపీలోకి వచ్చి చేరిన వారికి పార్టీ తరఫున ఎటువంటి కష్టం వచ్చినా శక్తి వంచన లేకుండా సహాయ సహకారాలు అందిస్తామని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో తాము రాజకీయాలను పక్కన పెట్టి చేస్తున్న కార్యక్రమాలే ఈ రోజు కరడు కట్టిన తెలుగుదేశం అభిమానులలో సైతం తమ వైపు వచ్చేలా చేస్తున్నాయని ఆయన  అన్నారు.