బెదురులంక..అదో రకం..అంతా ఎక్స్ ట్రీమ్

బెదురులంక 2012 టీజర్ వచ్చేసింది. హీరో కార్తికేయ నటించిన ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ వచ్చినపుడే ఇదేదో కొత్త తరహా సినిమా అన్న ఫీల్ ను కలిగించింది. ఇప్పుడు టీజర్ వచ్చింది. ఇది మరింత…

బెదురులంక 2012 టీజర్ వచ్చేసింది. హీరో కార్తికేయ నటించిన ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ వచ్చినపుడే ఇదేదో కొత్త తరహా సినిమా అన్న ఫీల్ ను కలిగించింది. ఇప్పుడు టీజర్ వచ్చింది. ఇది మరింత ఎక్స్ ట్రీమ్ వ్యవహారం అన్నట్లు వుంది. హీరోతో సహా ప్రతి పాత్ర కాస్త ఓవర్ గానే బిహేవ్ చేయడం విశేషం. గోదావరి నేపథ్యంలో అందమైన లంక గ్రామంలో వున్న పలు పాత్రల మధ్య జరిగే కథగా టీజర్ చెబుతోంది.

అన్నీ వింత వింత పాత్రలు వున్నాయి. వింతగా ప్రవర్తిస్తున్నాయి. వాటి నడుమ హీరో హీరోయిన్లు. జబర్దస్త్ కమెడియన్లు రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను వుండడం వల్లనో, ఈ పాత్రల అతి వ్యవహారం వల్లనో మొత్తానికి ఇదేదో జబర్దస్ట్ కు ఎక్స్ టెన్షన్ అన్నట్లు కూడా వుంది. కథ ఏమిటి అన్నది ఎక్కడా రివీల్ కాలేదు. ఎందుకంటే ఇది ఇంకా టీజర్ నే. ట్రయిలర్ ముందు వుంది.

కార్తికేయ సరసన నేహాశెట్టి హీరోయిన్ గా నటించింది. అజయ్ ఘోష్, శ్రీకాంత్ అయ్యంగార్ లాంటి తారాగణం కూడా వుంది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించడం విశేషం. ఈ సినిమాకు రచన, దర్శకత్వం క్లాక్స్. నిర్మాత రవీంద్ర బెనర్జీ ముప్పనేని.