పోల్చిచూస్తే.. నోర్లు మూతపడతాయ్!

ఏపీలో కూడా ప్రభుత్వం ఆర్టీసీ బస్సు చార్జీలను పెంచడానికి నిర్ణయించుకుంది. ఆర్డినరీ, సిటీబస్సుల్లో కిలోమీటరుకు 10 పైసలవంతున, పైస్థాయి బస్సుల్లో 20పైసల వంతున పెంచడానికి నిర్ణయించారు. Advertisement ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి కూడా ఈ…

ఏపీలో కూడా ప్రభుత్వం ఆర్టీసీ బస్సు చార్జీలను పెంచడానికి నిర్ణయించుకుంది. ఆర్డినరీ, సిటీబస్సుల్లో కిలోమీటరుకు 10 పైసలవంతున, పైస్థాయి బస్సుల్లో 20పైసల వంతున పెంచడానికి నిర్ణయించారు.

ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి కూడా ఈ పెంపును ఆమోదించడంతో.. సోమవారం అర్ధరాత్రి నుంచి కొత్త రేట్లు అమల్లోకి వస్తున్నాయి. ఇది ఆర్టీసీని అప్పల్లోంచి బయటపడేసే ప్రయత్నంగా పలువురు కీర్తిస్తుండగా… పచ్చదళాలు మాత్రం తమ కుట్ర బుద్ధులను చాటుకుంటున్నాయి.

ఆర్టీసీ సంస్థ ప్రస్తుతం నష్టాల్లో నడుస్తోంది. 6.7వేల కోట్ల రూపాయల అప్పుల ఊబిలో ఉంది. సిబ్బందికి జీతాలు పెంచడం, డీజిలు ధరలు పెరగడం వంటివి అదనంగా వచ్చి పడ్డాయి. 2015 నుంచి ఇప్పటికి డీజిలు ధర 50 నుంచి 70 దాకా పెరిగింది. కేవలం డీజిలు వల్ల.. ఆర్టీసీకి ఏటా 600 కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోంది. ఇలాంటి అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుని.. ప్రభుత్వం టికెట్ ధరలు పెంచింది. అయితే.. అక్కడికేదో ప్రజల మీద విపరీతమైన భారం మోపినట్లుగా అప్పుడే యెల్లో మీడియా ప్రచారాలు సాగుతున్నాయి.

ఆర్టీసీ విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో వీరు ఎందుకు పోల్చి చూసుకోలేకపోతున్నారో అర్థం కావడం లేదు. ఆర్టీసీ సమ్మె చేసినప్పుడు చాలా కఠినంగా వ్యవహరించినట్లు పేరు తెచ్చుకున్న కేసీఆర్.. ఆతర్వాత.. వారికి వరాలు ప్రకటించి.. బస్సు చార్జీలు పెంచారు. ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ వంటి తేడాలు లేకుండా అన్ని సర్వీసుల మీద కిలోమీటరుకు 20 పైసల వంతున  పెంచారు.

అయితే ఏపీలో జగన్ ప్రభుత్వం చాలా సంయమనంతో వ్యవహరించింది. పేదలపై అంతగా ఆర్థిక భారం పడకుండా జాగ్రత్తలు తీసుకుంది. పల్లెవెలుగు, సిటీ బస్సల్లో 10పైసలు మాత్రమే పెంచారు. కానీ.. ఈ అంశాన్ని మీడియా ప్రొజెక్టు చేయడం లేదు.

డీజిలు ధరలు పెరుగుతూ ఉండగా.. టికెట్ ధరలు ఈ మాత్రం కూడా పెంచకుండా.. ప్రభుత్వం ఏం చేయాలని మీడియా మేధావులు భావిస్తున్నారో అర్థం కాని సంగతి. బాధ్యతగల వారు ఇలాంటి తప్పుడు ప్రచారాలు మానుకుని.. నిర్ణయంలో ఉన్న అనివార్యతను ప్రజలకు బోధపరచాలి.