మారింది పేరేనా? సినిమా కూడానా?

మొత్తానికి ఆర్జీవీ సినిమా సెన్సారు గుమ్మం దాటి బయటకు వచ్చింది.  కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాను చూసిన రివిజన్ కమిటీ యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది. టైటిల్ ను 'అమ్మరాజ్యంలో కడప బిడ్లు' అని…

మొత్తానికి ఆర్జీవీ సినిమా సెన్సారు గుమ్మం దాటి బయటకు వచ్చింది.  కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాను చూసిన రివిజన్ కమిటీ యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది. టైటిల్ ను 'అమ్మరాజ్యంలో కడప బిడ్లు' అని మార్చినట్లు,  కొద్ది పాటి చిన్న చిన్న కటింగ్ లు ఇచ్చినట్లు తెలుస్తోంది.

అయితే పేరు మాత్రమే మారిందా, సినిమా కూడా మారిందా అన్న గుసగుసలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇంతకు ముందు సినిమా చూసిన రీజనల్  సెన్సారు కమిటీ చాలా భయంకరంగా కట్ చెప్పినట్లు బోగట్టా. అలాగే ఆ సినిమాలో లోకేష్ ను పోలిన క్యారెక్టర్ తో భయంకరంగా కామెడీ పండించినట్లు, చాలా పేర్లు, కేవలం ఇంటి పేర్లు మాత్రం మార్చి వాడేసినట్లు కూడా తెలుస్తోంది.

మరి ఇలాంటి వ్యవహారాలు అన్నీ అలాగే వదిలేసారా? లేక ఆర్జీవీ మరో వెర్షన్ ఏదైనా చూపించి సర్టిఫికెట్ తెచ్చుకున్నారా? అన్న అనుమానాలు వినిపిస్తున్నాయి. ఆర్థికంగా నష్టపోకూడదు, సినిమా ఏదో విధంగా గట్టెక్కాలని ఆర్జీవీ రాజీపడి సాప్ఠ్ వెర్షన్ చూపించి, సర్టిఫికెట్ తెచ్చుకున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. 

ఏది నిజమో, సినిమాలో వర్తమాన రాజకీయాల మీద, వర్తమాన రాజకీయ నాయకుల మీద ఏ మేరకు సెటైర్లు వేసారో అన్నది విడుదలైతే కానీ తెలియదు.