Advertisement

Advertisement


Home > Movies - Movie News

కెలుక్కున్న కార్తికేయ.. ప్రేక్షకుల తిట్ల వర్షం!

కెలుక్కున్న కార్తికేయ.. ప్రేక్షకుల తిట్ల వర్షం!

సినిమా విడుదలకు ముందు ప్రచారం ఎంతైనా చేసుకోవచ్చు. విడుదల తర్వాత మాత్రం ఆచితూచి వ్యవహరించాలి. ఓ మోస్తరు టాక్ వచ్చినా ఇంకాస్త ప్రచారం చేసుకోవచ్చు. హిట్ టాక్ వస్తే ప్రమోషన్ చేయకపోయినా ఫర్వాలేదు. ఫ్లాప్ టాక్ వచ్చినప్పుడు మాత్రం సైలెంట్ గా ఉండడం బెటర్. సరిగ్గా ఇక్కడే కార్తికేయ తప్పుచేశాడు. కోరి కెలుక్కున్నాడు, అందరితో తిట్లు తింటున్నాడు.

ఇతడు నటించిన 90ml సినిమా నిన్న థియేటర్లలోకి వచ్చింది. సినిమా పరమ చెత్తగా ఉందంటూ కామెంట్లు, రివ్యూస్ కూడా వచ్చేశాయి. ఇలాంటి టైమ్ లో కామ్ గా ఉండకుండా, తన సినిమాను సూపర్ హిట్ చేసిన ప్రేక్షకులు, అభిమానులకు థ్యాంక్స్ అంటూ ప్రకటించాడు కార్తికేయ. దీంతో అంతా కార్తికేయను గట్టిగా తగులుకున్నారు.

థియేటర్ నుంచి బయటకొచ్చిన తర్వాత నవ్వాలో ఏడవాలో అర్థంకాలేదని ఒకరంటే.. 90ml చూసిన తర్వాత కచ్చితంగా ఫుల్ కొట్టాల్సిందేనంటూ మరొకరు సెటైర్ వేశారు. మాస్ హీరో అవ్వాలనే తాపత్రయంలో కథను గాలికొదిలేశాడంటూ కొందరు సీరియస్ గా కామెంట్ చేస్తే.. అసలు ఈ కథ విన్నప్పుడు కార్తికేయ మందుకొట్టి ఉంటాడని మరికొందరు జోకులేశారు. ఇలా కార్తికేయపై ఓ రేంజ్ లో ట్రోల్ నడుస్తోంది సోషల్ మీడియాలో.

యూనిట్ మాత్రం పట్టు వదల్లేదు. మల్టీప్లెక్సుల్లో ఇది ఆడదని ముందే ఫిక్స్ అయిన మేకర్స్, ఇప్పుడు బి, సి సెంటర్లపై దృష్టిపెట్టారు. మొత్తమ్మీద ఈ సినిమాతో కార్తికేయకు స్టోరీ సెలక్షన్ రాదనే విషయం మరోసారి తేలిపోయింది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?