cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

11న 'అల' టీజర్

11న 'అల' టీజర్

బన్నీ ప్యాన్స్ ఆతృతగా ఎదురు చూసున్న అల వైకుంఠపురములో టీజర్ విడుదల దగ్గరకు వచ్చింది. టీజర్ ను 11న విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని ఆదివారం ప్రకటిస్తారు. అయితే టీజర్ ను విడుదల చేయడానికి ఓ రోజు ముందుగా చిన్న కొన్ని సెకండ్ల నిడివి వుంటే పైలట్ టీజర్ ను విడుదల చేస్తారు.

టీజర్ విషయంలో ఎట్టి లూప్ హోల్స్ వుండకూడదని అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు దర్శకుడు త్రివిక్రమ్. ముందుగా ఎడిటర్ నవీన్ నూలి కట్ చేసిన మూడు నాలుగు టీజర్లను చూసి, ఆఖరికి మరో టీజర్ ను ఆయనే దగ్గర వుండి కట్ చేయించారు. ఆ తరువాత మళ్లీ మార్పులు చేర్పులు చేసి, టెక్నికల్ వర్క్ కు హ్యాండోవర్ చేసారు.

అయితే థమన్ ఇటు వెంకీమాట, అటు ప్రతిరోజూ పండగ సినిమా పనుల్లోనూ, అలాగే అల వైకుంఠపురం రీ రికార్డింగ్ ప్లానింగ్ లోనూ బిజీ కావడంతో ఈ పని ఆలస్యమైంది. లేదూ అంటే సోమవారం విడుదల చేద్దాం అనుకున్నారు. మంగళవారం సెంటిమెంట్ కావడంతో, బుధవారానికి వాయిదా వేసారు.

ఇప్పటికి మూడు పాటలు విడుదలచేసారు. ఇంకా రెండు పాటలు విడుదల చేయాల్సివుంది. ఆ తరువాత ట్రయిలర్ జనవరి మొదటివారంలో వుంటుంది.