సినిమా ఎలా వుండబోతోందో చెప్పగలిగేది ట్రయిలర్ నే. కొంతవరకు. ఎంత తెలివిగా ట్రయిలర్ కట్ చేసినా కూడా కాస్తో..కూస్తో..నాడి అందుతుంది. ఆ విధంగా చూసుకుంటే ఈ రోజు వదిలిన వెంకీమామ ట్రయిలర్ సినిమా ప్రామిసింగ్ గా వుండబోతోంది అనే చెబుతోంది. ఇప్పటికే వెంకీమామ సంగతులు చాలా వరకు బయటకు వచ్చేసాయి. కథ ఇలా వుండబోతోంది, ఫస్ట్ హాఫ్ ఫన్, సెకండాఫ్ ఎమోషన్ అని జనాలు చెప్పుకునే వరకు వచ్చేసింది.
ఇలాంటి నేపథ్యంలో వచ్చిన ట్రయిలర్ ఫుల్ ప్రామిసింగ్ గా కనిపించింది. యంగ్ జనరేషన్స్ కు నచ్చే చైతూ రొమాన్స్, ఫ్యామిలీలకు నచ్చే వెంకీ వెటరన్ లవ్, అనుబంధాలు, ఎమోషన్లు, వీటన్నింటి మధ్య పవర్ ప్యాక్డ్ యాక్షన్ సీన్లు పక్కాగా జోడించారు.
దీంతో చాన్నాళ్ల తరువాత మళ్లీ పవర్ ప్యాక్డ్ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ సినిమా వస్తోంది అన్న భరోసా కలిగించింది. ఇవ్వాళా, రేపు ప్రేక్షకులు కాస్త జనరస్ గా వుంటున్నారు. ఎఫ్ 2 లో సెకండాఫ్ కాస్త డౌన్ అయినా, ఆ ఎంటర్ టైన్మెంట్ కోసం నెత్తిన పెట్టుకున్నారు. వాళ్ల ఆకలి తీర్చే సినిమా వస్తే, చిన్న చిన్న మైనస్ లు వున్నా క్షమించేసి ఆదరించేస్తున్నారు.
ఇలా ఎలా చూసినా వెంకీమామ మాంచి ప్రామిసింగ్ అనే చెబుతోంది ట్రయిలర్. దర్శకుడు బాబీ అందిస్తున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా..సురేష్ మూవీస్ కలిసి నిర్మిస్తున్నాయి.