‘ఆ అమ్మాయి’ బుల్లితెరపై కూడా ఫ్లాప్ అయింది

సుధీర్ బాబు, ఇంద్రగంటి కాంబినేషన్ అనగానే మంచి కంటెంట్ ఆశిస్తారు ప్రేక్షకులు. కానీ వీళ్లిద్దరూ కలిసి తీసిన 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' అనే సినిమా మాత్రం ఏ కోణంలోనూ ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది.…

సుధీర్ బాబు, ఇంద్రగంటి కాంబినేషన్ అనగానే మంచి కంటెంట్ ఆశిస్తారు ప్రేక్షకులు. కానీ వీళ్లిద్దరూ కలిసి తీసిన 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' అనే సినిమా మాత్రం ఏ కోణంలోనూ ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది. చిన్న పాయింట్ ను సీరియల్ కంటే దారుణంగా సాగదీసి తీసిన ఈ సినిమా, సిల్వర్ స్క్రీన్ పై ఫ్లాప్ అయింది.

ఇప్పుడీ సినిమా బుల్లితెరపై అంతకంటే ఘోరమైన ఫలితాన్ని చవిచూసింది. తాజాగా జెమినీ టీవీలో ప్రసారం చేసిన ఈ సినిమాకు దారుణమైన రేటింగ్ వచ్చింది. తొలిసారి ప్రసారంలో ఈ మూవీకి కేవలం 1.5 టీఆర్పీ వచ్చింది. ఓ సినిమాను తొలిసారి ప్రసారం చేసినప్పుడు మినిమం రీచ్ ఉంటుంది. కొత్త సినిమా కాబట్టి చూస్తారు. కనీసం ఆ ఎట్రాక్షన్ కూడా సుధీర్ బాబు సినిమాకు లేకుండా పోయింది.

తాజా రేటింగ్ తో 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమా పరాజయం పరిపూర్ణమైంది. ఇంద్రగంటి మోహనకృష్ణ డైరక్ట్ చేసిన ఈ సినిమాలో సుధీర్ బాబు సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది.

కాన్సెప్ట్ మంచిదే అయినప్పటికీ బరువైన కథనాన్ని ప్రేక్షకుడు మోయలేకపోయాడు. దీనికితోడు నెరేషన్ సరిగ్గా లేకపోవడంతో, ఏ సెక్షన్ ఆడియన్స్ నూ ఇది మెప్పించలేకపోయింది. ఈ సినిమా తర్వాత సుధీర్ బాబు మరో మూవీ చేసినప్పటికీ, ఇంద్రగంటి మాత్రం ఇప్పటివరకు మరో ప్రాజెక్టు ను పట్టాలెక్కించలేకపోయాడు.