నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గుండెపోటుకు గురయ్యారు. దీంతో హుటాహుటిగా నెల్లూరు అపోలో ఆస్పతికి తరలించారు. ప్రస్తుతం నెల్లూరు ఆపోలో ఆస్పతిలో వైద్యుల పర్యవేక్షణలో చిక్సిత అందిస్తున్నారు.
ప్రస్తుతం ఎమ్మెల్యే పరిస్థితి కాస్త విషమంగానే ఉండటంతో మెరుగైన వైద్యం కోసం చెన్నైకి తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
కాగా ఇటీవల తన నియోజకవర్గంలో నియమించిన వైసీపీ సమన్వయకర్త విషయంలో సొంత పార్టీపైనే విమర్శలు చేయడంతో ఆయన అభ్యర్ధను మన్నించి కొత్త సమన్వయకర్తను నియమించింది వైసీపీ అధిష్టానం.