ఎన్టీఆర్ సినిమాలో విక్రమ్?

తన సినిమాల్లోకి సరైన స్టార్ కాస్ట్ ను తీసుకురావడంలో దర్శకుడు కొరటాల శివ చాలా దిట్ట. మిర్చి లో సత్యరాజ్ ను, జ‌నతా గ్యారేజ్ లో మోహన్ లాల్ ను అలాగే తీసుకువచ్చాడు. ఆచార్యలోకి…

తన సినిమాల్లోకి సరైన స్టార్ కాస్ట్ ను తీసుకురావడంలో దర్శకుడు కొరటాల శివ చాలా దిట్ట. మిర్చి లో సత్యరాజ్ ను, జ‌నతా గ్యారేజ్ లో మోహన్ లాల్ ను అలాగే తీసుకువచ్చాడు. ఆచార్యలోకి రామ్ చరణ్ ను తీసుకువచ్చారు. ఇప్పుడు లేటెస్ట్ గా చేయబోతున్న ఎన్టీఆర్ సినిమా కూడా అలాంటి ఫీట్ నే చేయబోతున్నారు. 

అసలే పాన్ ఇండియా భారీ సినిమా. అందుకే తమిళ, హిందీ రంగాల నటుల పేర్లు పరిశీలిస్తున్నారు. సినిమాలో ఓ కీలకమైన పాత్రకు తమిళ హీరో విక్రమ్ ను తీసుకురావాలనే ప్రయత్నాలు జ‌రుగుతున్నాయి. 

ఒకవేళ విక్రమ్ కాకుండా మరెవరు అనే ఆలోచన కూడా సాగుతోంది. బాలీవుడ్ నుంచి సైఫ్ ఆలీఖాన్ పేరు కూడా పరిశీలనలో వున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ సమస్య సదరు నటుల అంగీకారంతో పాటు, డేట్ లు అడ్జ‌స్ట్ కావడం కూడా.

ఎందుకంటే ఈ సినిమాను నవంబర్ లోపు కచ్చితంగా ఫినిష్ చేయాల్సి వుంది. ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ అత్యవసరంగా ప్రశాంత్ నీల్ సినిమా మీదకు వెళ్లాల్సి వుంది. ఇదిలా వుంటే ఎన్టీఆర్ 30 సినిమాకు ఈ నెలలో పూజ‌ చేసి, మార్చి నుంచి షూట్ కు వెళ్తారు.