దర్శకుడు త్రివిక్రమ్..హారిక హాసినిలో కావచ్చు. పవన్ కళ్యాణ్ దగ్గర కావచ్చు. ఆయన మాటే శాసనం. ఇప్పుడు ఆ రెక్కలు మరికొన్ని ప్రొడక్షన్ హౌస్ లకు కూడా విస్తరిస్తున్నాయి. సినిమాలు సెట్ చేయడం ద్వారా ఆ ప్రొడక్షన్ హౌస్ లు త్రివిక్రమ్ నీడలోకి వచ్చేసాయి. కానీ ఇలా రావడం ఆయనకు, ఆ సంస్థలకు బాగానే వుందేమో కానీ, పాపం ఓ మెగా హీరోకి మాత్రం తన కెరీర్ ఎటు వెళ్తోందో తెలియని పరిస్థితి వుంది.
ఓ తమిళ సినిమా రీమేక్ ప్రాజెక్టు ను పవన్ కోసం సెట్ చేసారు త్రివిక్రమ్. దాంట్లో సాయి ధరమ్ తేజ్ ను రెండో హీరోగా ఆయనే ఫిక్స్ చేసారు. ఇక అక్కడి నుంచి అలా కూర్చోపెట్టారు. చెప్పే వరకు ఎవరికీ డేట్ లు ఇవ్వవద్దు అని చెప్పేసారు. ఎప్పటికీ జరగకపోవడంతో చేతిలో వున్న సినిమా షూట్ కానిచ్చేయమన్నారు. తరువాత మరో సినిమా స్టార్ట్ చేయాలి అంటే ముందు ఈ త్రివిక్రమ్ సెట్ చేసిన ప్రాజెక్టు సంగతి తేలాలి. ఎప్పుడు అని అడిగే వీలు లేదు. ఎప్పుడు రమ్మంటే అప్పుడు జీ హుజూర్ అంటూ వెళ్లిపోవాల్సిందే. పైగా అసలు ఆ రీమేక్ తన కెరీర్ ఏ మేరకు ఉపయోగపడుతుందో తెలియదు. మామయ్య సినిమా. త్రివిక్రమ్ చెప్పారు అంతే.
నిఙానికి యాక్సిడెంట్ ఙరిగి కోలుకున్న తరువాత చాల ప్లాన్డ్ గా సినిమాలు చేయాలి. ఇప్పుడు నడుస్తున్న థ్రిల్లర్ సినిమా విరూపాక్ష మంచి సబ్ఙెక్ట్ నే. తరువాత లైన్ లో సరైన సినిమాలు ఎంచుకోవాలి అంటే ఈ రీమేక్ అడ్డంగా వుంది. ఇది కేవలం సాయి ధరమ్ తేజ్ కు మాత్రమే కాదు. పవన్ ఫ్యాన్స్ కు కూడా నచ్చడం లేదు. వారు సోషల్ మీడియాలో గోల పెడుతున్నారు. రీమేక్ లు వద్దు అంటూ. పైగా త్రివిక్రమ్ ను కామెంట్ చేస్తున్నారు కూడా.
ఇదిలా వుంటే ఇలా సెట్టింగ్ లు చేయడం వల్ల త్రివిక్రమ్ పేరు కూడా బదనామ్ అవుతోంది. ఇందులో ఆయనకు లాభం వుందో లేదో తెలియదు కానీ, త్రివిక్రమ్ కేవలం లాబియింగ్ చేసి సంపాదించుకుంటున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. వాటి సంగతి ఎలా వున్నా పవన్, సాయి ధరమ్ తేజ్ కెరీర్ ను కూడా కనీసం త్రివిక్రమ్ చూడాలి కదా?