టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర నిన్న మచిలీపట్నంలో చేసిన రచ్చపై స్పందించారు వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని. కొల్లు రవీంద్ర చెప్పేవన్నీ శ్రీరంగ నీతులని.. కానీ చేసేదంతా వేరేనని తనదైన శైలీలో కౌంటర్ ఇచ్చారు. అక్రమ మార్గంలో అడ్డగోలుగా ఎదగాలనే ఉద్దేశంతో పోలీసుల పైనే చేయి చేసుకుని కావాలని కేసులు పెట్టించుకుని పబ్లిసిటీ కోసం రవీంద్ర ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు.
టీడీపీ అధికారంలో ఉండి మంత్రిగా చేసిన తప్పులను కప్పిపుచ్చడానికి ఇప్పుడు వైసీపీపై నిందలు వేస్తున్నారని.. అడ్డగోలుగా ప్రభుత్వ జీవోలను విడుదల చేసి ప్రభుత్వ భూములు టీడీపీ పార్టీకి ధారధత్తం చేసిన ఘనత టీడీపీకే దక్కుతుందని హెద్దేవా చేశారు. మచిలీపట్నం టీడీపీ కార్యాలయానికి ప్రభుత్వ భూమి లీజుకి కావాలని అడిగింది నువ్వు కాదా అంటూ మండిపడ్డారు.
మాజీ మంత్రి కొల్లు రవీంద్ర.. బందరు కమల్ హాసన్ లాంటి వాడని రవీంద్ర చేసే నటన మందు కమల్ హాసన్, ఎస్వీ రంగారావు లాంటి నటుల యాక్టింగ్ కూడా దిగదుడుపేనని.. పదవి ఉన్నప్పుడు పని చేయలేదు.. పదవి పోగానే ఇలాంటి దిక్కుమాలిన డ్రామాలు అడతాడని విమర్శించారు. ఇప్పటికైనా డ్రామాలు అపాలని హితవు పలికారు.