టీడీపీ-జ‌న‌సేన‌ కలిసిపోతాయి.. ప‌వ‌న్ ప్ర‌క‌ట‌న‌

ఇన్ని రోజులు లోపాయికారిగా రాజకీయం నడిపిన జనసేన- టీడీపీలు ఎట్టకేలకు ఒక‌టయ్యాయి. స్వయంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జైల్లో ఉన్న చంద్రబాబుని ములాఖత్ ద్వారా కలిసి చ‌ర్చించి నిర్ణయం తీసుకున్నారు. జైలు బయట…

ఇన్ని రోజులు లోపాయికారిగా రాజకీయం నడిపిన జనసేన- టీడీపీలు ఎట్టకేలకు ఒక‌టయ్యాయి. స్వయంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జైల్లో ఉన్న చంద్రబాబుని ములాఖత్ ద్వారా కలిసి చ‌ర్చించి నిర్ణయం తీసుకున్నారు. జైలు బయట ప‌వ‌న్ మీడియాతో మాట్లాడుతూ ఇవాళ నుండి జనసేన తెలుగుదేశం పొత్తులో ఉన్న‌ట్లు తేల్చిచెప్పారు. రేప‌టి నుండే ఉమ్మ‌డి కార్య‌చ‌ర‌ణ మొద‌ల‌వుతుంద‌ని ప్ర‌క‌టించారు.

ఇవాళ చంద్రబాబును జైల్లో కలిసిన అనంతరం మీడియాతో ఆయ‌న మాట్లాడుతూ.. జగన్ ఏమైనా మహానుభావుడా అంటూ ప్రశ్నించారు. జగన్ బురదలో కూరుకుపోయి అందరికీ బురద అంటించాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. బాబుతో ములాఖత్ ఏపీ రాజకీయాల్లో కీలకమైందని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తాయ‌ని తెల్చిచెప్పారు. అలాగే బీజేపీ కూడా త‌మ కుట‌మిలోకి వ‌స్తుందంటూ ఆశ‌భావం వ్య‌క్తం చేశారు.

చంద్ర‌బాబు అరెస్టు వెనుక బీజేపీ లేద‌నే విష‌యం తేల్చి చెప్పారు.  బాబు భ‌ద్ర‌త‌పై ప్ర‌ధాని మోడీ, అమిత్ షాల దృష్టికి తీసుకెళ్తానన్నారు. మొత్తానికి ఇన్ని రోజులు లోపాయికారిగా రాజకీయం న‌డిపిన ఇరు పార్టీలు రేప‌టి నుండి ప్ర‌జ‌ల ముందుకు వ‌స్తున్న‌ట్లు ప్ర‌క‌టించాయి. మ‌రి రెండు చోట్ల ఓడిపోయిన ప‌వ‌న్ పార్టీకి టీడీపీ ఎన్ని సీట్లు ఇస్తుంద‌నే విష‌యం మాత్రం ఇంకా తెలియ‌డం లేదు.