బిగ్‌బాస్ హౌజ్ నుంచి ఎలిమినేట్ కావడంతో తన గుండె పగిలిందని యాంకర్ రవి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బిగ్‌బాస్ హౌజ్ ముగింపు దశకు చేరింది. ఈ నేపథ్యంలో అనూహ్యంగా యాంకర్ రవి బయటికి వచ్చారు. హౌజ్ అనంతరం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
తన ఎలిమినేషన్‌పై రవి షాకింగ్ కామెంట్స్ చేశారు. తన ఎలిమినేషన్‌పై బిగ్‌బాస్ నిర్వాహకులు కూడా ఫీల్ అవుతున్నారని భావిస్తున్నట్టు చెప్పారు. ఎందుకంటే తనను బయటికి పంపడం …ఎక్కడో రాంగ్ జరిగిందని నిర్వాహకులు అనుకుంటున్నారని రవి అభిప్రాయపడ్డారు.
తాను ఎలిమినేట్ కావడంపై హర్ట్ అయినట్టు రవి ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకంటే హౌజ్‌లో బాగా ఆడే ఇద్దరు ముగ్గురు కంటెస్టెంట్లలో తాను కూడా ఒకడినన్నారు. అలాంటిది ఎలిమినేట్ అవుతానని అసలు ఊహించలేదన్నారు. ఇది చాలా బాధాకరమన్నారు. తాను ఎందుకు ఎలిమినేట్ అయ్యానో పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత మాట్లాడ్తానన్నారు.
తప్పు ఎక్కడ జరిగిందో విశ్లేషణ చేయాల్సి వుందన్నారు. తనకు సంబంధించి ఎలాంటి కంటెంట్ చూపారో తెలియదన్నారు. అలాగే హౌజ్‌లో తనతో పాటు తోటి కంటెస్టెంట్ ఎవరెవరు ఎలా ఆడుతారో బాగా తెలుసన్నారు. ఇదిలా వుండగా హౌజ్ నుంచి బయటికి వచ్చిన రవికి అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.