దేవా కట్టా మోత మళ్లీ మొదలైంది

రిపబ్లిక్ సినిమా థియేటర్లలో విడుదలయింది. దాని ప్లస్ లు దానికి వున్నాయి. దాని మైనస్ లు దానికి వున్నాయి. జ‌నాలు ఊరికినే ఏ సినిమానూ తిరస్కరించరు. నెత్తి మీద పెట్టుకోరు. దేని కారణాలు దానికి…

రిపబ్లిక్ సినిమా థియేటర్లలో విడుదలయింది. దాని ప్లస్ లు దానికి వున్నాయి. దాని మైనస్ లు దానికి వున్నాయి. జ‌నాలు ఊరికినే ఏ సినిమానూ తిరస్కరించరు. నెత్తి మీద పెట్టుకోరు. దేని కారణాలు దానికి వుంటాయి. విజ‌యానికైనా, అపజ‌యానికైనా కొన్ని నేపథ్యాలు తప్పవు. కానీ దీన్ని విస్మరించి సమీక్షలు మాత్రమే సినిమాను విజ‌వయంతం కాకుండా చేసాయని అనుకోవడం అవివేకమే అవుతుంది.

కానీ దేవా కట్టాను ఓ మంచి దర్శకుడుగా అభిమానించడం కన్నా, వివిధ కారణాల రీత్యా అభిమానించేవారు రిపబ్లిక్ సినిమాను తెగ మోయాలని చూసారు. విడులదయిన తరువాత అదే పని కొన్నాళ్లు ట్విట్టర్ లో కొనసాగించారు. అయినా సినిమాను జ‌నాలు పక్కన పెట్టారు. బయ్యర్లు కుదేలయ్యారు. కావాలంటే సాయితేజ్ తరువాత సినిమా మార్కెట్ మీద ఈ ప్రభావం వుంటుందో లేదో చూస్తే అప్పుడు అర్ధం అవుతుంది.

అది అలా వుంచితే ఇప్పుడు ఈ సినిమా ఓటిటి లోకి వచ్చింది. మోత కార్యక్రమం మళ్లీ మొదలైంది. మళ్లీ గతంలో ఎవరయితే దేవాను, సినిమాను మోయాలని కిందా మీదా అయిపోయారో ఇప్పుడు మళ్లీ వాళ్లే మోత, భజ‌న ప్రారంభించారు. కానీ వాళ్లకు తెలియాల్సింది ఏమిటంటే సినిమా నిజంగా సక్సెస్ అయితే, నిజంగా అద్భుతం అయితే దర్శకుడిని ఎవ్వరూ మోయనక్కరలేదు. సినిమాలు వెదుక్కుంటూ వస్తాయి.

అటో నగర్ సూర్య తరువాత దేవా కట్టాకు సినిమా రావడానికి ఏడెేళ్లు ఎందుకు పట్టింది? అది కూడా క్రిటిక్స్ తప్పేనా..తెలుగు క్రిటిక్స్ నెత్తిన పెట్టుకున్న ప్రస్థానం సినిమాను బాలీవుడ్ జ‌నాలు ఎందుకు తిరస్కరించారు.బాహుబలి లాంటి సిరీస్ చేతిలో పెడితే దేవా ఎందుకు సంతృప్తి పరచలేకపోయారు. రిపబ్లిక్ డిజాస్టర్ కావడానికి అనేక కారణాలు వుండొచ్చు. కానీ క్రిటిక్స్, సమీక్షలు మాత్రమే అనుకుంటే అవివేకమే అవుతుంది.

సోషల్ మీడియాలో మనకున్నస్నేహాలతో, సర్కిల్ తో ఎంత హడావుడి అయినా చేసేసుకోవచ్చు. కానీ మరో సినిమా చేయడం, రావడం ఎంత త్వరగా అన్నదే టాలీవుడ్ లో విజ‌యానికి కొలమానం. దానికి క్రిటిక్స్ అడ్డం కాదు.