Advertisement

Advertisement


Home > Movies - Movie News

అంచనాలు నిలబెడుతున్న కొరటాల

అంచనాలు నిలబెడుతున్న కొరటాల

ఓ భారీ సినిమాకు అప్ డేట్ లు ఇవ్వడం మాత్రమే కీలకం కాదు. ఇచ్చిన ప్రతి అప్ డేట్ అప్ టు ది మార్క్ వుండాలి. అందులోనూ ఈ అప్ డేట్ లు ఇస్తూనే సినిమా మీద అంచనాలు పెంచుకోవాలి. 

సినిమా మీద బజ్ ను నిలబెట్టుకుంటూ రావాలి. ఈ యాంగిల్ లో చూస్తుంటే మెగాస్టార్-కొరటాల కాంబినేషన్ లో తయారవుతున్న ఆచార్య సినిమా అన్ని విధాలా సక్సెస్ అవుతోంది. విడుదల చేసిన ప్రతి అప్ డేట్ సినిమా మీద అంచనాలను పెంచుతోంది తప్ప తగ్గించడం లేదు.

లాహె. లాహె పాట విడుదల చేసారు. సర్రున దూసుకుపోాయింది. నీలాంబరీ పాట కూడా అదే దారిలో వెళ్తోంది. మెగాస్టార్ ఫస్ట్ లుక్ దగ్గర నుంచి నిన్న వదిలిన చరణ్ క్యారెకక్టర్ టీజ‌ర్ తో సినిమాకు మరింత బజ్ వచ్చింది. మెగాస్టార్ కెరీర్ లోనే ఇంతకాలం నిర్మాణంలో వున్న సినిమా ఇదే. 

కొరటాల శివ లాంటి పెద్ద దర్శకుడు ఒక్క సినిమా మీద ఇన్ని ఏళ్లు వుండిపోయారు. కానీ వస్తున్న అవుట్ పుట్ చూస్తుంటే అంచనాలు. పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. 2022 లో రాబోతున్నపెద్ద సినిమాల్లో ఆచార్య ఒకటి.

ఈ సినిమా రేంజ్ బట్టి, కలెక్షన్లు బట్టి మెగాస్టార్ లేటెస్ట్ మార్కెట్ మీద ఓ అంచనా వస్తుంది. దాని మీదే గాడ్ ఫాదర్, భోళాశంకర్, వాల్తేర్ వీరయ్య సినిమాల ప్లానింగ్ కూడా డిపెండ్ అయి వుంటుంది. అయితే కొరటాల శివకు తెలిసిన మేకింగ్ మ్యాజిక్ మిగిలిన డైరక్టర్లకు కూడా తెలియాల్సి వుంటుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?