ఇస్తున్నారు కదా అని ఎడం చేత్తో, కుడి చేత్తో అడ్వాన్స్ లు తీసుకోవడం వరకు బాగానే వుంటుంది. కానీ సినిమాలు చేయాల్సి వచ్చినపుడే సమస్య అవుతుంది. కథలు పుట్టాలి. హీరోలు దొరకాలి. ఇంకా చాలా చాలా వుంటుంది. శివనిర్వాణ లాంటి దర్శకులు సినిమా స్టార్ట్ చేసే ముందు తప్ప అడ్వాన్స్ తీసుకోరు. అది ఓ పద్దతి. పరుశురామ్ లాంటి వారు ఇస్తే చాలు తీసుకుంటారు. అలాంటపుడే సమస్య వస్తుంది.
ఏనాటి నుంచో సినిమా చేయాలి 14 రీల్స్ కు. దానిని పక్కన పెట్టి మైత్రీకి వెళ్లారు. అప్పుడే 14 రీల్స్ వాళ్లు చాలా బాధపడ్డారు. వాళ్ల బ్యానర్ ను యాడ్ చేసి, ఏదో అయ్యింది అనిపించారు. ఇప్పుడు 14రీల్స్ సినిమా అలా వుండగానే దిల్ రాజు సినిమా ప్రకటించారు. దీంతో ఏది ముందు అన్న అనుమానం వుండనే వుంది. 14రీల్స్ నే ముందు వుంటుందని టాక్ వుంది.
ఇదిలా వుంటే భోగవిల్లి ప్రసాద్ ఏనాడో అడ్వాన్స్ ఇచ్చారు. దానికి మోక్షం ఎప్పుడో తెలియదు. ఇప్పుడు భోగవిల్లి ప్రసాద్ కూడా ఈ కందిరీగల తుట్టను కదిపే ఆలోచన చేస్తున్నారు. ఇలా సినిమాలు చిక్కుముడి పడడం అన్నది అటు నిర్మాతలకు, హీరోలకు ఇబ్బందే. ఈ అడ్వాన్స్ ల విషయంలో ఓ పద్దతి అంటూ ఇండస్ట్రీలో పెద్దగా లేదు. జస్ట్ బ్యాంక్ ట్రాన్స్ ఫర్ చేసేయడం తప్ప, ఫలానా సినిమా, ఫలానా నెంబర్ అన్నది మాటల వరకే తప్ప, కాగితాలు, రాత కోతలు వుండవు. పివిపి లాంటి వాళ్లు తప్ప పకడ్బందీగా లాక్ వేయడం వుండదు.
ఇప్పుడు జరుగుతున్న వ్యవహారాలు అన్నీ చూస్తుంటే ఇక రాబోయే కాలంలో గట్టి తాళాలు వేసి మరీ అడ్వాన్స్ ఇచ్చే పద్దతి మొదలు అయ్యేలా వుంది.