లోకేశ్‌కు అన్నీ ఆయ‌న తెలివితేట‌లే…అందుకే!

చంద్ర‌బాబునాయుడంటే రాజ‌కీయంగా మ‌హా మేధావి అని పేరు. ఎన్టీఆర్ లాంటి ప్ర‌జానాయ‌కుడిని సీఎం గ‌ద్దె నుంచి కూల‌దోసి, విజ‌య‌వంతంగా మ‌ళ్లీ అధికారంలోకి వ‌చ్చారంటే… చంద్రబాబు తెలివితేట‌లు ఎలాంటివో అర్థం చేసుకోవ‌చ్చు. ఏ మాత్రం జ‌నాక‌ర్ష‌ణ…

చంద్ర‌బాబునాయుడంటే రాజ‌కీయంగా మ‌హా మేధావి అని పేరు. ఎన్టీఆర్ లాంటి ప్ర‌జానాయ‌కుడిని సీఎం గ‌ద్దె నుంచి కూల‌దోసి, విజ‌య‌వంతంగా మ‌ళ్లీ అధికారంలోకి వ‌చ్చారంటే… చంద్రబాబు తెలివితేట‌లు ఎలాంటివో అర్థం చేసుకోవ‌చ్చు. ఏ మాత్రం జ‌నాక‌ర్ష‌ణ లేని చంద్ర‌బాబు సుదీర్ఘ కాలం పాటు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను ప‌రిపాలించ‌డం వెనుక ఆయ‌న యుక్తి త‌ప్ప‌, మ‌రే శ‌క్తులు కార‌ణం కాదు. ఎవ‌రినైనా మేనేజ్ చేయ‌గ‌ల స్కిల్స్ ఆయ‌న సొంతం.

అలాంటి అప‌ర‌మేధావి త‌న‌యుడు లోకేశ్‌ను చూస్తే… ఏందీ మ‌నిషి, తిక్క‌తిక్క‌గా మాట్లాడుతున్నాడ‌నే ఆవేద‌న టీడీపీ శ్రేణుల్లో క‌ల‌గ‌డాన్ని అర్థం చేసుకోవ‌చ్చు. పండిత పుత్రః పరమ శుంఠః అనే సామెత ఇందుకే కాబోలు పుట్టింద‌ని స‌రిపెట్టుకుంటూ వుంటారు. లోకేశ్ పాద‌యాత్ర చేస్తుండ‌డంతో ఆయ‌న మాట్లాడ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీంతో లోకేశ్ కెపాసిటీ ఏంటో జ‌నానికి బాగా తెలిసొస్తోంది.

ప్ర‌శాంత‌తకు బ‌దులు ప్ర‌శాంత అత్త అని, అలాగే ప‌నిముట్ల‌కు బ‌దులు పందిముట్లు….ఇలా లోకేశ్ త‌ప్పులు మాట్లాడుతుంటే, టీడీపీ కార్య‌కర్త‌లు, నాయ‌కులు త‌లలు ప‌ట్టుకునే ప‌రిస్థితి. చంద్ర‌బాబు తెలివితేట‌లు ఒక్క‌ట‌న్నా లోకేశ్‌కు రాలేదేందిరా సామి? ఇంత‌కూ ఈ ఆణిముత్యాల్లాంటి మాట‌లు ఎవ‌రి బుర్ర అని ఆలోచిస్తే… ఇప్పుడిప్పుడే క్లారిటీ వ‌స్తోంది. ఈ ఘ‌న‌త మేన‌మామ‌తో పాటు పిల్ల‌నిచ్చిన మామ నంద‌మూరి బాల‌కృష్ణ బుర్ర పుణికి పుచ్చుకోవ‌డ‌మే అని టీడీపీ శ్రేణులు నిర్ధార‌ణ‌కు వ‌చ్చాయి.

ఒక‌సారి మాట ఇటూఇటూ దొర్లితే, అది పొర‌పాట‌ని అనుకోవ‌చ్చు. రెండోసారి కూడా అదే రిపీట్ అయితే త‌ప్పు అని స‌రిపెట్టుకోవ‌చ్చు. ప‌దేప‌దే త‌ప్పులు చేస్తే… దాన్ని అహంకారం, కండ‌కావ‌ర‌మ‌ని చెబుతారు. బాల‌కృష్ణ త‌ప్పులు లెక్కిస్తే… చేంతాడంత జాబితా త‌యార‌వుతుంది. ఇటీవ‌ల అక్కినేనిని ఉద్దేశించి తొక్కినేని అంటూ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ఆ త‌ప్పును స‌రిదిద్దుకోడానికి బ‌దులు, మ‌రొక‌టి చేసిన సంగ‌తి తెలిసిందే.

తాజాగా  ‘అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే’ షోలో బాల‌య్య త‌న‌కు వైద్యం చేసిన నర్సుల గురించి అవాకులు చెవాకులు పేలారు. ‘ఆ నర్సు దాన.. భలే అందంగా ఉందిలే’ అంటూ నోరు జారారు. త‌మ‌కు క్ష‌మాప‌ణ చెప్పాల‌ని నర్సులు డిమాండ్ చేస్తున్నారు. ఇవ‌న్నీ అజ్ఞానానికి సంబంధించిన నిద‌ర్శ‌నాలు. చంద్ర‌బాబు అరుదుగా త‌ప్ప‌. ఇలా నోరు పారేసుకున్న సంద‌ర్భం లేదు. కానీ గ‌తంలో నాయీ బ్రాహ్మ‌ణుల‌ను ఉద్దేశించి తోక క‌త్తెరిస్తాన‌ని హెచ్చ‌రించి, త‌గిన మూల్యం చెల్లించుకున్నారు. అదేంటో గానీ, మామాఅల్లుళ్లు త‌ప్పులు మాట్లాడ్డ‌మే ప‌నిగా ప్రాక్టీస్ చేస్తున్న‌ట్టుగా క‌నిపిస్తున్నారు. ఏమోలేబ్బా… వాళ్ల బ్ల‌డ్‌, బ్రీడ్ వేరు క‌దా? లోకేశ్‌కు అన్నీ మామ‌య్య తెలివితేట‌లే. జై లోకేశ్‌, జైజై బాల‌య్య‌! వ‌ర్ధిల్లాలి మీ తెలివితేట‌లు!!

సొదుం ర‌మ‌ణ‌

10 Replies to “లోకేశ్‌కు అన్నీ ఆయ‌న తెలివితేట‌లే…అందుకే!”

  1. అరె లంజా కొడక ఇలా అయితే జంగం లంగా రెడ్డి గురుంచి 100 పేజీల పుస్తకం రాయచ్చు.

Comments are closed.