స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్ట్ అయి రాజమండ్రి జైలులో ఉన్న మాజీ సీఎం చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ ములాఖత్ కానున్న నేపథ్యంలో మంత్రి అంబటి రాంబాబు సెటైరికల్ ట్వీట్ చేశారు. ఎప్పుడో అయ్యాడు.. ఇప్పుడేముంది కొత్తగా ములాఖత్ అని ట్వీట్ చేశారు.
కాగా పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పటి నుండి కూడా చంద్రబాబుతో కలిసే ఉన్నరంటూ వైసీపీ చెబుతునే ఉంది. దానికి తగ్గట్టుగానే 2014లో ఎన్నికల్లో తన పార్టీ నిలబడకుండా టీడీపీ కోసం ప్రచారం చేశారు. 2019 ఎన్నికల్లో కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చిల్చడం కోసం టీడీపీ నుండి బయటి వెళ్లి ఎన్నికల్లో నిలబడరంటూ వైసీపీ నేతలు అంటున్నారు. అందుకే వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ పేరు కూడా ఎత్తకుండా ఫ్యాకేజీ స్టార్ లేదా చంద్రబాబు దత్తపుత్రుడు అంటూ పిలుస్తున్న విషయం తెలిసిందే.
దానికి తగ్గట్టుగానే పవన్ కూడా తన పార్టీ కోసం కంటే టీడీపీ కోసం కష్టపడుతున్నారు. చంద్రబాబు అరెస్ట్ టైంలో పవన్ చేసిన హడవుడితో ఇన్ని రోజులు వైసీపీ నేతలు చెప్పిన మాటలు నిజమయ్యాయి. మరీ ముఖ్యంగా లోకేష్ కంటే ఎక్కువగా బాధపడిపోయిన పవన్ను చూసి జనాలు అశ్చర్యపోయారు. కాగా ఇవాళ ములాఖత్ తర్వాత పవన్ ఏం మాట్లాడుతారో అనేది జనసైనికులు ఎదురుచుస్తున్నారు.