నెల్లూరు జిల్లాలో రాజకీయంగా పెద్దింట్లో పుట్టాడు. అయినా ఏం లాభం నోటికొచ్చేది గలీజు కూతలే. రాజకీయంగా విమర్శలు చేయడం చేతకాక, కనీసం మహిళ అనే గౌరవం లేకుండా ప్రత్యర్థులతో వడివేలుగా పిలుపించుకునే ఆ వ్యక్తి ఇవాళ మంత్రి రోజాపై అసభ్య కామెంట్స్ చేశాడు. ఇలాంటి వెధవల్ని ఏ పార్టీలో ఉన్నా ఏమీ చేయలేరా? అని పౌర సమాజం ప్రశ్నిస్తోంది.
చంద్రబాబు అరెస్ట్ మొదలుకుని, ప్రతి రోజూ మంత్రి రోజా తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. బాబును అరెస్ట్ చేస్తే, నగరిలో రోజా సంబరాలు చేసుకున్నారు. రాజకీయంగా తనను తీవ్రంగా ఇబ్బంది పెట్టిన బాబు అరెస్ట్‌ను రోజా సెలబ్రేట్ చేసుకున్నారు. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని ఆమె పదేపదే విమర్శిస్తున్నారు.
రోజా విమర్శలను ప్రతి విమర్శలతో తిప్పి కొట్టొచ్చు. కానీ నెల్లూరు వడివేలు మాత్రం ఆ పని చేయరు. ఎందుకంటే ఆయనకు సంస్కారం అనేది మచ్చుకైనా లేనట్టుంది. మహిళలను తిడితే, తమ పార్టీకి చెందిన కుటుంబ సభ్యుల్ని కూడా అదే రేంజ్‌లో బజారుకు ఈడుస్తారనే ఇంగితం వడివేలులో లోపించినట్టుంది.
అందుకే ఆయన రోజాపై బజారు భాషను ప్రయోగించాడు. ‘మేయ్… రోజా నిన్ను, మీ నాయకుడిని అరెస్ట్ చేసి రోడ్డు మీద ఈడ్చుకెళ్లే రోజు దగ్గర్లోనే ఉంది. రాజమండ్రి జైళ్లో సంబరాలు చేసుకుందురు. సెక్స్ రాకెట్‌తో నీకు సంబంధం ఉందో, లేదో తెలియదు కానీ, ఉండి ఉండొచ్చు కూడా. చంద్రబాబుకి మాత్రం సంబంధం లేదు’ అని నోరు పారేసుకున్నాడు.
రోజా ప్లేస్‌లో భువనేశ్వరి, బ్రాహ్మణి పేర్లను పెట్టి వైసీపీ నేతలతో తిట్టించాలనే అతను కారుకూతలు కూశాడని ప్రత్యర్థులు మండిపడుతున్నారు. నోటికి అడ్డూఅదుపూ లేకుండా మాట్లాడే ఇలాంటి వ్యక్తుల వల్లే రాజకీయాలతో సంబంధం లేని రాజకీయ నేతల కుటుంబాల్లోని మహిళలు మాట పడాల్సి వస్తోంది.