సోషల్ మీడియాలో టాలీవుడ్ అగ్రహీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను సోషల్ మీడియాలో నెటిజన్లు అన్‌స్టాపబుల్ అంటే వాయించేస్తున్నారు. టాక్‌షోలో పవన్‌కల్యాణ్ మూడు పెళ్లిళ్లపై బాలయ్య తనదైన శైలిలో ప్రశ్నిస్తారు. మూడు పెళ్లిళ్లు చేసుకోడాన్ని సమర్థించుకుంటూ పవన్‌కల్యాణ్ ఏవో సినిమా కథలు చెబుతారు. సరే ఆయన వ్యక్తిగత విషయం అని సరిపెట్టుకుందాం.
మూడు పెళ్లిళ్లను సమర్థిస్తూ, ఇదే సందర్భంలో పవన్ వైవాహిక జీవితాన్ని ప్రశ్నించే వారిని ఉద్దేశించి ఊరకుక్కలని బాలయ్య నోరు పారేసుకోవడం తెలిసిందే. ఈ విషయమై బాలయ్యను ఇప్పటికే నెటిజన్లు ఫుట్‌బాల్ ఆడుకుంటున్నారు. తాజాగా బాలయ్యపై అదిరిపోయే పంచ్ విసరడం అందరినీ ఆకట్టుకుంటోంది. పెళ్లిళ్లపై ఎదుటి వాళ్లకు నీతులు చెప్పేందుకేనా, తమ వరకూ వస్తే మాత్రం వ్యతిరేకిస్తారా? అనే ప్రశ్నతో మొదలు పెట్టి, బాలయ్యను దబిడి దబిడే అని చీవాట్లు పెట్టడం గమనార్హం.
పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్లని సమర్ధిస్తున్న ఓ బాలయ్యా…. మరి మీ నాన్న చేసుకున్న రెండో పెళ్లిని ఎందుకు వ్యతిరేకించావని నెటిజన్లు నిలదీయడం వైరల్ అవుతోంది. ఆ రెండో పెళ్లిని సాకుగా చూపే కదా, కన్న తండ్రి అని కూడా చూడకుండా అమాన వీయంగా సీఎం సీటు నుంచి కూలదోసిందని నెటిజన్లు దెప్పి పొడుస్తున్నారు.
జీవిత చరమాంకంలో కన్నబిడ్డల ఆదరణకు నోచుకోక, తోడు కోసం రెండో పెళ్లి చేసుకున్నాడని వెలేసిన వారిని ఏమని పిలవాలో చెప్పయ్యా బాలయ్యా అని నెటిజన్లు ప్రశ్నలతో చితక్కొడుతున్నారు.