తనది కాకపోతే కాశీదాకా డేకేస్తా అన్నాట్ట వెనకటికి ఎవడో. టాలీవుడ్ లోని ఓ టాప్ మ్యూజిక్ డైరక్టర్ వ్యవహారం అలాగే వున్నట్లుంది.
ఇప్పటికే ఇతగాడితో సినిమా అంటే ఖర్చులు జాస్తి అన్న టాక్ ఇండస్ట్రీలో వుంది. కానీ పెద్ద సినిమాలకు మ్యూజిక్ అంటే మరీ ఒకటి రెండు పేర్లే వినిపిస్తున్నాయి కాబట్టి, కోర్కెల ఖర్చు భరిస్తున్నారు.
పండగకు రాబోయే సినిమాల్లో ఒకదానికి ఈ మ్యూజిక్ డైరక్టర్ సంగీతం అందిస్తున్నారు. పాటల వ్యవహారం పూర్తయిపోయింది. రీరికార్డింగ్ వుంది. అయితే రీరికార్డింగ్ విదేశాల్లో చేద్దాం అని ప్రపోజల్ ను సదరు మ్యూజిక్ డైరక్టర్ పెట్టినట్లు తెలుస్తోంది. దాంతో నిర్మాతలకు షాక్ కొట్టినట్లు అయింది.
పండగకు వచ్చే సినిమాలకు ఇప్పటికే ఓవర్ బడ్జెట్ అయిందని, నిర్మాతలకు లాభాలు రావడం అన్నది వేరే సంగతి, టేబుల్ లాస్ కాకుండా వుంటే అంతే చాలు అని ఇప్పటికే ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో విదేశాల్లో రీరికార్డింగ్ అంటే ఖర్చు మరింత పెరుగుతుంది.
అందుకే మెల్లగా ఆ మ్యూజిక్ డైరక్టర్ కు నచ్చ చెప్పి, హైదరాబాద్ లో చేసుకో లేదా అంటే చెన్నయ్ లో చేసుకో బాబూ అని బ్రేక్ వేసారట.