ఇప్పుడే ఎన్నికలు కావాలి.. పవన్ పై భీకర సెటైర్లు!

ఎన్నికలు అయిపోయి దాదాపు ఆరు నెలలు గడుస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పుడిప్పుడే కుదురుకుంటోంది. ఏపీ జనాలు ఎన్నికల్లో చాలా స్పష్టమైన తీర్పును ఇచ్చాయి. హంగూ బొంగు లేకుండా.. క్లియర్ కట్ మెజారిటీని, ల్యాండ్ స్లైడ్ విక్టరీని…

ఎన్నికలు అయిపోయి దాదాపు ఆరు నెలలు గడుస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పుడిప్పుడే కుదురుకుంటోంది. ఏపీ జనాలు ఎన్నికల్లో చాలా స్పష్టమైన తీర్పును ఇచ్చాయి. హంగూ బొంగు లేకుండా.. క్లియర్ కట్ మెజారిటీని, ల్యాండ్ స్లైడ్ విక్టరీని ఏపీ ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అప్పగించారు.

తెలుగుదేశం పార్టీని చిత్తుగా ఓడించారు. చంద్రబాబు తనయుడిని ఎమ్మెల్యేగా ఓడించారు. అలా ఎమ్మెల్యేగా ఓడిన వారిలో జనసేన అధిపతి పవన్ కల్యాణ్ కూడా ఉన్నారు. ఈయన అయితే రెండు చోట్ల పోటీ చేసి మరీ ఓడిపోయారు. ఈ ఆరు నెలల్లో పవన్ కల్యాణ్ అడపాదడపా మీడియా ముందుకు వచ్చారు. తన కార్యకర్తల ముందుకు వచ్చి ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు.

ఇప్పుడు పవన్ కల్యాణ్.. పూర్తిగా మత, కుల రాజకీయం గురించినే మాట్లాడుతూ ఉన్నారు. కులా, మత విద్వేషాలను రెచ్చగొట్టేలా పవన్ మాట్లాడుతూ ఉన్నారు. తద్వారా ఏదో రాజకీయ లబ్ధి పొందాలని పవన్ భావిస్తున్నట్టుగా ఉన్నారు.

ఈ విషయంలో ఎవరు ఏమనుకున్నా ఫర్వాలేదన్నట్టుగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఏపీ ప్రజలు ఇలాంటి మాటలను పెద్దగా ఎంటర్ టైన్ చేసే అవకాశాలు లేవు.

తన మూఢాభిమానులను పవన్ కల్యాణ్ ఇలా ఎంటర్ టైన్ చేయొచ్చేమో కానీ, మిగతా వాళ్లను కాదు. అసలు పవన్  కల్యాణ్ ను జనాలు ఎంత వరకూ సీరియస్ గా తీసుకుంటారనేది ఎన్నికలతో కూడా స్పష్టం అయ్యింది. ఆ సంగతలా ఉంటే.. అప్పుడే ఎన్నికలు కావాలంటూ పవన్ మాట్లాడటం పట్ల సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి!

'ఎప్పుడంటే అప్పుడు చేసుకోవడానికి అదేమన్నా పెళ్లి అనుకున్నావా పవన్ కల్యాణ్.. ఎన్నికలు..' అంటూ కొంతమంది సెటైర్లు వేస్తున్నారు. 'మూడు పెళ్లిళ్లు చేసుకున్నట్టుగా ఎన్నిసార్లు కావాలంటే అన్ని సార్లు, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎన్నికలు పెట్టుకోవచ్చు అనుకున్నావా..' అంటూ కొందరు పవన్ పై  ఘాటుగా స్పందిస్తున్నారు.

ఇక మరి కొందరు అయితే..'ఉన్న ఒక్క సీటుకూడా ఊడిపోవడానికి ఎన్నికలు  అప్పుడే కోరుకుంటున్నావా..' అంటూ జనసేన అధిపతి పవన్ కల్యాణ్ ను ఎద్దేవా చేస్తూ ఉన్నారు. ఇలా మాట్లాడి అభాసుపాలవుతున్నాడు పవన్ కల్యాణ్.