హీరో నిఖిల్ తన మనసులో మాట బయటపెట్టాడు. దర్శకుడిగా మారతానంటున్నాడు ఈ యంగ్ హీరో. అది కూడా డైరక్టర్ గా మారి కమర్షియల్ సినిమా చేయడంట. చిన్న పిల్లలతో ఓ ప్రయోగాత్మక సినిమా తీస్తానంటున్నాడు.
“దర్శకుడిగా మారుతున్నాను. ఇంతకుముందు హైదరాబాద్ నవాబ్ చిత్రానికి అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేశాను. ఆ అనుభవంతో చిన్నారులతో ఓ సినిమా తీయబోతున్నాను. దీనికి సంబంధించి ప్రస్తుతం కథాచర్చలు జరుగుతున్నాయి. ఈ లాక్ డౌన్ టైమ్ లోనే అన్ని నిబంధనలు పాటిస్తూ చిన్నారులతో చిన్న సినిమా తీసే ప్లానింగ్ లో ఉన్నాను.”
ఇలా తన మనసులో మాట బయటపెట్టాడు నిఖిల్. 'అర్జున్ సురవరం' సక్సెస్ తర్వాత హీరోగా బిజీ అయ్యాడు నిఖిల్. చేతిలో 18-పేజెస్, కార్తికేయ-2 లాంటి సినిమాలున్నాయి. రేపోమాపో ఆ సినిమాల సెట్స్ పైకి వస్తాడనుకున్న టైమ్ లో నిఖిల్ ఇలా దర్శకత్వ ఆలోచనల్ని బయటపెట్టడం నిజంగా ఆశ్చర్యమే.
ప్రస్తుతానికైతే నిఖిల్ అన్ని రకాల సినిమా ఆలోచనల్ని పక్కనపెట్టాడు. కొత్తగా పెళ్లి చేసుకున్న ఈ హీరో.. పూర్తిగా తన వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేసే పనిలో ఉన్నాడు. దర్శకుడిగా, హీరోగా ఇతడి కొత్త సినిమాలు మొదలవ్వడానికి ఇంకాస్త టైమ్ పట్టేలా ఉంది.