‘భ్రమరావతి’ని పటాపంచలు చేయబోతున్న ఏసీబీ

అమరావతి రాజధాని పేరిట చంద్రబాబు హయాంలో జరిగిన భూపందేరంపై ఏసీబీ పూర్తిస్థాయిలో అడుగుపెట్టింది. ఇప్పటికే ఈ కుంభకోణానికి సంబంధించి ప్రాధమిక సాక్ష్యాధారాలు సేకరించిన ఏసీబీ.. ఈ మేరకు ఈరోజు కేసు నమోదు చేసింది. Advertisement…

అమరావతి రాజధాని పేరిట చంద్రబాబు హయాంలో జరిగిన భూపందేరంపై ఏసీబీ పూర్తిస్థాయిలో అడుగుపెట్టింది. ఇప్పటికే ఈ కుంభకోణానికి సంబంధించి ప్రాధమిక సాక్ష్యాధారాలు సేకరించిన ఏసీబీ.. ఈ మేరకు ఈరోజు కేసు నమోదు చేసింది.

రాజధానిని అమరావతిలోనే ఏర్పాటుచేయాలని నిర్ణయం తీసుకొని, ఆ మేరకు తన అనుచరులతో, బినామీలతో అక్కడ చంద్రబాబు భూములు కొనిపించారనడానికి ఏసీబీ వద్ద ఆధారాలున్నాయి. ఈ మేరకు రాజధాని ప్రకటనకు ముందే సీఆర్డీఏ పరిథిలో భూముల క్రయవిక్రయాలకు సంబంధించి జరిగిన లావాదేవీలన్నింటినీ ఏసీబీ అధికారులు ఓ కొలిక్కి తెచ్చారు. గమ్మత్తైన విషయం ఏంటంటే.. కోట్ల రూపాయల ఖరీదైన ఈ భూములు కొనుగోలు చేసిన వాళ్లలో తెల్ల రేషన్ కార్డుదారులు కూడా ఉన్నారు.

సెప్టెంబర్ 3, 2015న రాజధాని ప్రకటన చేసింది అప్పటి టీడీపీ ప్రభుత్వం. అంతకంటే ముందు 2014, జూన్ 1 నుంచి 2014 డిసెంబర్ 31 వరకు అమరావతి చుట్టుపక్కల భూముల అమ్మకాలు-కొనుగోళ్లు భారీ స్థాయిలో జరిగినట్టు ఏసీబీ గుర్తించింది. అంతేకాదు.. లంక భూములు, పోరంబోకు భూముల రికార్డుల్లో కూడా అవకతవకలు చోటుచేసుకున్నాయి. కొన్ని ప్రభుత్వం భూముల సరిహద్దులు కూడా మారిపోయాయి.

రాజధాని ప్రకటన కంటే ముందే అమరావతి ప్రాంతంలో భారీ ఎత్తున భూములు కొనుగోలు చేసిన వాళ్లలో బాబు కేబినెట్ లోని మంత్రులు, ఎమ్మెల్యేలు, లోకేష్ సన్నిహితులు, బాలకృష్ణ బంధువులు ఉన్నారు. భూములు కొనుగోలు చేసిన వ్యక్తుల్లో దాదాపు 90శాతం మంది వీళ్లే. ఘోరమైన విషయం ఏంటంటే.. తమకు కావల్సిన వ్యక్తులు భూములు కొన్న తర్వాత, ఆ భూములు సీఆర్డీఏ పరిథిలోకి వచ్చేలా ప్రభుత్వం అప్పట్లో ప్రత్యేక చీకటి జీవోలు కూడా రిలీజ్ చేసింది.

ఓవరాల్ గా 4075 ఎకరాల భూమి టీడీపీ నేతలు, వాళ్ల బినామీల చేతుల్లో ఉన్నట్టు ఏసీబీ గుర్తించింది. వీటిలో 900 ఎకరాలు అసైన్డ్ భూముల్ని దళితుల నుంచి లాక్కున్నట్టు తేలింది. ఇక లిస్ట్ ను ఓసారి పరిశీలిస్తే.. లోకేష్ బినామీ వేమూరి రవి పేరిట 62 ఎకరాలు, నారాయణ బినామీ పేర్లతో 55 ఎకరాలు, మాజీ ఎమ్మెల్యే కొమ్మాలిపాటి శ్రీధర్ బినామి పేరిట 68 ఎకరాలు, మాజీ మంత్రి ప్రత్తిపాటి బినామీ పేరిట 38 ఎకరాలు, మరో మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు పేరిట 40 ఎకరాలు ఉన్నట్టు ఏసీబీ గుర్తించింది.

అమరావతిలో భూముల కొనుగోళ్లు, అమ్మకాలకు సంబంధించి సిట్ సమగ్ర దర్యాప్తు నిర్వహించింది. పూర్తి నివేదికను ప్రభుత్వానికి అందించింది. ఆ నివేదిక ఆధారంగా ఏసీబీ దర్యాప్తునకు ఆదేశించింది ప్రభుత్వం. ఇప్పుడు ఇందులో తొలి అడుగు పడింది. కేసు నమోదు చేసిన ఏసీబీ.. త్వరలోనే పలువురికి సమన్లు జారీ చేయబోతోంది.

నాకు లవ్ స్టోరీలు నచ్చవు.. హెబ్బా

ఆ జోష్ వైసీపీకి ఇప్పట్లో వస్తుందా?