పెళ్లైన హీరోయిన్ గ్లామర్ స్టిల్స్ సినిమాల కోసమా?

తరచూ తన అలోన్ ఫొటో షూట్లను నిర్వహిస్తున్నట్టుగా ఉంది జెనీలియా డిసౌజా. తెలుగు వారు బాగా మరిచిపోయిన పేరిది. దాదాపు పదేళ్ల కిందట జెనీలియా కెరీర్ తెలుగునాట పీక్ స్టేజ్ ను చూసింది. ఫెయిర్…

తరచూ తన అలోన్ ఫొటో షూట్లను నిర్వహిస్తున్నట్టుగా ఉంది జెనీలియా డిసౌజా. తెలుగు వారు బాగా మరిచిపోయిన పేరిది. దాదాపు పదేళ్ల కిందట జెనీలియా కెరీర్ తెలుగునాట పీక్ స్టేజ్ ను చూసింది. ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ లో మెరిసిన తర్వాత సౌత్ లో స్టార్ హీరోయిన్ అయ్యింది జెన్నీ. మొదట్లో ఐరన్ లెగ్ గా ముద్రపడినా ఆ తర్వాత ఆమెకు తిరుగు లేకుండా పోయింది.

పెద్దగా ఎక్స్ పోజింగ్ గట్రా లేకుండా కేవలం నటన, క్యూట్ నెస్ ద్వారానే నెట్టుకొచ్చింది జెనీలియా. స్టార్ హీరోలతోనూ మెరిసింది. అదే సమయంలో ఒక బిగ్ షాట్ తనయుడితో ప్రేమను సాగించింది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్ రావ్ దేశ్ ముఖ్ ఇంటి కోడలయ్యింది. జెనీలియా కుటుంబ సభ్యులు రాజకీయంగా తమ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ఉన్నారు.

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా విలాస్ రావ్ తనయులు ఇద్దరు ఘన విజయాలు సాధించారు. ఇలా వీరి కుటుంబం రాజకీయంగా పట్టు నిలుపుకుంటూ ఉంది. మరోవైపు జెనీలియా భర్త ఇండస్ట్రీపై దండయాత్రలు కొనసాగిస్తూ ఉన్నాడు. సోలో హీరోగా ఇతడు విజయాన్ని అందుకోలేకపోతున్నాడు. 

ఇదంతా అలా ఉంటే.. జెనీలియా రీ ఎంట్రీ కోసం ప్రయత్నాలు సాగిస్తూ ఉందని తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో పెళ్లైన హీరోయిన్లు రాణిస్తూ ఉన్నారు. ఐశ్వర్య, దీపికా, ప్రియాంక.. ఇలా పెళ్లైన హీరోయిన్ల రాజ్యం నడుస్తోంది.

అందుకే జెనీలియా కూడా తరచూ ఫొటో షూట్లను నిర్వహించి, సోషల్ మీడియాలో ఆ ఫొటోలను పెట్టి.. తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే సినిమాల్లోకి రీ ఎంట్రీ విషయంలో తనకు తొందరేం లేదని, మంచి పాత్ర దొరికినప్పుడే రీ ఎంట్రీ అంటూ మరోవైపు  ఈ హీరోయిన్ చెబుతూ ఉంది.