Advertisement

Advertisement


Home > Movies - Movie News

మళ్లీ దొరికిపోయిన వెంకీమామ

మళ్లీ దొరికిపోయిన వెంకీమామ

ఇప్పటికే సోషల్ మీడియాలో పూర్తిస్థాయిలో దొరికిపోయాడు వెంకీమామ. ఈ సినిమాతో పాటు అటు నిర్మాత సురేష్ బాబును ట్యాగ్ చేస్తూ నెటిజన్లు ఆడుకుంటున్నారు.

వెంకీమామ రిలీజ్ ఎప్పుడమ్మా అనే హ్యాష్ ట్యాగ్ కూడా పాపులర్ అయిందంటే పరిస్థితి ఎంత దయనీయంగా తయారైందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి టైమ్ లో ప్రెస్ మీట్ పెట్టి మరీ కాన్సిల్ చేయడంతో వెంకీమామపై మరోసారి ఫ్రెష్ గా ట్రోలింగ్ మొదలైంది.

ఇప్పటికే వెంకీమామ రిలీజ్ డేట్ పై చాలా డిస్కషన్ నడుస్తోంది. సురేష్ బాబు మోస్ట్ అన్-ప్రొఫెషనల్ గా వ్యవహరిస్తున్నారని కామెంట్స్ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి నిర్ణయించడంతో.. అంతా ఊపిరిపీల్చుకున్నారు. కచ్చితంగా రిలీజ్ డేట్ చెబుతారని ఎదురుచూశారు. కానీ అంతలోనే ప్రెస్ మీట్ కాన్సిల్ చేశారు.

మీడియా సమావేశం పెడతామని చెప్పడం ఎందుకు, తిరిగి కాన్సిల్ చేయడం ఎందుకంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. అసలు ప్రెస్ మీట్ పెట్టే బదులు.. రిలీజ్ డేట్ తో ఓ పోస్టర్ రిలీజ్ చేస్తే సరిపోయేదంటూ కొందరు కామెంట్ చేస్తే.. అసలు రిలీజ్ చేసే ఉద్దేశం ఉందో లేదో చెప్పాలంటూ మరికొందరు విమర్శించారు. 

అన్నింటి కంటే పీక్స్ ఏంటంటే.. థియేట్రికల్ సంగతి పక్కనపెట్టి, ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో ఎప్పుడొస్తుందో చెప్పాలంటూ సోషల్ మీడియాలో ప్రశ్నించడం మొదలుపెట్టారు జనం.

నిజానికి ఈరోజు దిల్ రాజు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. రాజ్ తరుణ్ హీరోగా తీసిన ఇద్దరి లోకం ఒకటే మూవీ అప్ డేట్ చెబుదామనుకున్నారు. అంతలోనే అది కాన్సిల్ చేశారు. ఆ వెంటనే సురేష్ బాబు ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నారు. అది కూడా కాన్సిల్ చేశారు. చూస్తుంటే.. రాజ్ తరుణ్ సినిమాకు, వెంకీమామకు ఏదో కనెక్షన్ ఉన్నట్టుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?