పావలా ఇచ్చి పది రూపాయల ప్రచారం సాగించుకోవడం, ట్వీట్ లు, రీ ట్వీట్ లు, వీడియో బైట్ లు వేయించుకోవడం, పీఆర్వోలు తిరిగి తిరిగి ఆ ఇచ్చిన పావలాకూ పది రూపాయల భజన సాగేలా చేయడం అంటే టాలీవుడ్ తరువాతే. లేదూ అంటే అస్సలు ఇవ్వకుండా సైలంట్ గా వుండడం.
డ్యాన్స్ మాస్టర్ శివశంకర్ కుటుంబం మొత్తానికి కోవిడ్ సోకిందని, వైద్యం చేయించుకోవడమే కష్టంగా వుందని, సాయం చేయాలని అపీల్ చేసారు ఆయన కొడుకు. 24 గంటలు గడుస్తున్నా టాలీవుడ్ నుంచి స్పందన లేదు.
పోటా పోటీగా కొట్టేసుకున్నవాళ్లు, లేదా అపర దానకర్ణులమని చాటుకునే ప్రయత్నం చేస్తున్నవారు ఎవ్వరూ స్పందించిన దాఖలా లేదు. కానీ సోనూ సూద్ మాత్రం తాను మాట్లాడానని, సాయం చేస్తానని కనీసం మాట అన్నా ఇచ్చారు.
తమిళ హీరో ధనుష్ ఏకంగా చాలా సైలంట్ గా ఎవ్వరికీ తెలియకుండా పదిలక్షల సాయం అందించేసారు. దీనికి అస్సలు పబ్లిసిటీ వద్దు అని ఆయన కోరారు. అదీ దాతృత్వం అంటే.