మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని మరోసారి తీవ్ర విమర్శల దాడి చేశారు. బాబుపై పంచ్‌లు విసురుతూ చెలరేగిపోయారు.
వరద బాధితులను పరామర్శిస్తున్న చంద్రబాబు… ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏరియల్ సర్వే నిర్వహించడంపై ఘాటు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కొడాలి నాని తన నోటికి ఎప్పట్లాగే పని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మాదిరిగానే ఆయన తనయుడు కూడా గాలిలోనే కలిసిపోతాడనే అర్థంలో చంద్రబాబు అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడాన్ని కొడాలి నాని తప్పు పట్టారు.
వైఎస్ రాజశేఖరరెడ్డికి మరణం లేదన్నారు. ఇదే చంద్రబాబు జీవించి ఉన్నా… ప్రాణం లేనివాడితో సమానమని ఘాటు వ్యాఖ్యలు చేశారు. వరద నష్టాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తక్షణమే స్పందించారని నాని గుర్తు చేశారు. వరద సహాయక చర్యలపై సీఎం ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నారన్నారు. కానీ చంద్రబాబు అసత్య ఆరోపణలు చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు.
భార్యను రోడ్డు మీదకు ఈడ్చిన ఘనత చంద్రబాబుదే అన్నారు. చంద్రబాబు రాజకీయ వ్యభిచారిగా వ్యవహరిస్తున్నారని దుయ్య బట్టారు. రాజకీయ అవసరాల కోసం భార్యను రోడ్డు మీదకు తేవడం అన్యాయమన్నారు. చంద్రబాబులా రాజకీయ ప్రయోజనాల కోసం భార్యను రోడ్డు మీదికి ఏ ఒక్కరూ తీసుకురాలేదన్నారు.
చంద్రబాబు మాదిరిగానే లోకేశ్ వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఏదోలా రాజకీయ లబ్ధి పొందాలని చంద్రబాబు తాపత్రయపడుతున్నారని అన్నారు. చంద్రబాబు బుద్ధి, జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ వదిలేసి కుంటిసాకులతో బయటకెళ్లిపోయారన్నారు.
చంద్రబాబు, ఎల్లో మీడియా కలిసి భువనేశ్వరి పరువు దిగజార్చారని విమర్శించారు. వరదల్లో బాధితుల పరామర్శకు వెళ్లి.. నన్ను అవమానించారంటూ చంద్రబాబు ఏడుస్తున్నారని కొడాలి నాని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం వరద ముంపునకు మానవ తప్పిదమే కారణమని, సీబీఐ దర్యాప్తు చేయాలని బాబు ప్రశ్నించడంపై కొడాలి నాని సీరియస్‌గా స్పందించారు.
గోదావరి పుష్కరాల్లో దర్శకులను తీసుకొచ్చి, తొక్కిసలాటకు కారణమై …29 మంది భక్తుల మరణానికి నాడు చంద్రబాబు తప్పిదమని గుర్తు చేశారు. దానిపై ఎలాంటి విచారణ చేయాలని ప్రశ్నించారు.